అయ్యా మాకు దారి కల్పించండి.

అయ్యా మాకు దారి కల్పించండి.

‎మూడు సంవత్సరాలుగా వేడుకుంటున్నాం ఇప్పటికైనా కనికరించండి.

ప్రభుత్వ దారిని ఆక్రమించుకున్నారు, దారి లేకుండా చేశారు.

‎వ్యవసాయ భూముల దారికై  తహసిల్దార్ కు వినతి పత్రం.

మహాదేవపూర్ ,భూపాలపల్లి: జూన్ 12 (నిజం న్యూస్)

‎వ్యవసాయ భూములకు ఏళ్ల తరబట్టి ఉన్న ప్రభుత్వ రహదారిని కొందరు రైతులు ఆక్రమించుకొని సుమారు 200 రైతులకు వ్యవసాయ భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని గత మూడు సంవత్సరాలుగా వ్యవసాయ భూములను ఆక్రమించుకున్న రైతుల నుండి విముక్తి కలిగించి మాకు రహదారి సదుపాయం కల్పించాలని పలుమార్లు వినతి పత్రం ఇచ్చిన స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సూరారం గ్రామ రైతులు శుక్రవారం రోజు స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మహదేవపూర్ మండలంలోని సూరారం గ్రామానికి చెందిన సుమారు 200 మంది రైతులకు చింతగండి చెరువు కాలువ కు ఆనుకొని రైస్ మిల్ సమీపం నుండి లక్ష్మీపూర్ శివారు జానపద చెరువు వరకు దశాబ్దాల కాలంగా ఎడ్ల బండి దారి వ్యవసాయ భూముల్లోకి వెళ్ళుటకు కలిగి ఉంది. కానీ గత నాలుగు సంవత్సరాలుగా, సమీప రైతులు ఆ దారిని పూర్తిగా ఆక్రమించి, సూరారం రైతులకు లక్ష్మీపూర్ శివారు లో ఉన్న పంటలకు వెళ్ళుటకు దారి లేకుండా చేయడం జరిగింది. సుమారు 200 మంది రైతులు లక్ష్మీపూర్ శివారులో పత్తి పంట వరి, మిర్చి లాంటి పెద్ద మొత్తంలో సాగు చేయడం జరుగుతుంది, పంటలకు సంబంధించి రైతులు వెళ్ళుటకు రహదారి లేకపోవడం, ఇతర అవసరాలకు ఎడ్లబండ్లు వాహనాలు వెళ్లకుండా రహదారి ఆక్రమించడంతో పంటల సాగుకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రహదారి సదుపాయం లేక పరుమార్లు, సమయానికి ఎరువుల మందులు రవాణా సదుపాయం లేకపోవడంతో పంటలు కూడా నష్టపోవడం జరిగిందని చెబుతున్నారు రైతులు. అలాగే కాలినడక ద్వారా పెళ్లి పరిస్థితి వచ్చినప్పటికీ, ప్రభుత్వ రహదారిని ఆక్రమించుకున్న రైతులు, తమ పంట పొలాల్లో వెళ్లకుండా అడ్డుపడడం, తో తమకు పంటల పురోగతి సమాచారం లేకపోవడంతో పెద్ద మొత్తంలో పంటలు చూస్తుండగానే నష్టపోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు.

మూడు సంవత్సరాలుగా వేడుకుంటున్నాం ఇప్పటికైనా కనికరించండి.

‎ గత మూడు సంవత్సరాలుగా తహసిల్దార్ కార్యాలయం చుట్టూ పదుల మార్లు తిరిగి పలుమార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని కానీ రెవెన్యూ శాఖ మాత్రం, దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ప్రభుత్వ రహదారి ఆక్రమణకు గురైందని చెప్పినప్పటికీ పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రతి సంవత్సరం, తమకు పెద్ద మొత్తంలో పంట నష్టం కలుగుతుందని, ఇప్పటికైనా తక్షణమే రెవెన్యూ అధికారులచే సర్వే చేయించి సాధ్యమైనంత త్వరగా రహదారి సదుపాయం కల్పించాలని వినతి పత్రంలో కోరారు సూరారం రైతులు. రైతుల వినతి పత్రం తీసుకున్న తహసిల్దార్, సాధ్యమైనంత త్వరలో లక్ష్మీపూర్ శివారు రహదారి సమస్యను పరిష్కరించి రైతులకు రహదారి సౌకర్యం కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు రైతులు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button