వచ్చే సంవత్సరం నాటికి మేడిగడ్డ సాగునీరు.
మేడిగడ్డ పునరుద్ధరణ పనులను పరిశీలించిన మంత్రి. ఏలాంటి రాజకీయ దురద్దేశం లేకుండా ప్రాజెక్టు పనులు. అన్నారాం సుందిళ్ల, గ్యారేజీల మరమ్మట్టు పనులు చేపట్టడం జరిగింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థ ఆఫ్రిన్ తో సంప్రదింపులు. ఐఐటి ముంబై తో రీడిజైన్,జులై నాటికి పరిక్షలు పూర్తి. కర్నల్ పరిషత్ మెహర చైర్మన్ ఆధ్వర్యంలో కార్యాచరణ.

వచ్చే సంవత్సరం నాటికి మేడిగడ్డ సాగునీరు.
మేడిగడ్డ పునరుద్ధరణ పనులను పరిశీలించిన మంత్రి.
ఏలాంటి రాజకీయ దురద్దేశం లేకుండా ప్రాజెక్టు పనులు.
అన్నారాం సుందిళ్ల, గ్యారేజీల మరమ్మట్టు పనులు చేపట్టడం జరిగింది.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థ ఆఫ్రిన్ తో సంప్రదింపులు.
ఐఐటి ముంబై తో రీడిజైన్,జులై నాటికి పరిక్షలు పూర్తి.
కర్నల్ పరిషత్ మెహర చైర్మన్ ఆధ్వర్యంలో కార్యాచరణ.
మహాదేవపూర్, భూపాలపల్లి: జూన్ 10 (నిజం న్యూస్)
వచ్చే సంవత్సరం 2027 నాటికి మేడిగడ్డ ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులను పూర్తి చేసి, రాష్ట్ర ప్రజలకు సాగునీరు అందించుటకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని అన్నారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి. బుధవారం రోజు మేడిగడ్డవద్ద జరుగుతున్న పునరుద్ధారణ పనులను పరిశీలించిన మంత్రి అనంతరం మాట్లాడుతూ, ప్రాజెక్ట్ రూపమైన నిర్మాణం వల్ల కుంగడం జరిగిందని, దీనికి అంచనాలు తయారు చేసి సాంకేతిక అత్యంత పకడ్బందీ పరీక్షలు నిర్వహించి ప్రాజెక్ట్ వినియోగం లోకి తెచ్చుటకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రాజెక్ట్ మరమ్మతు విషయంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంగా తెలిపారు. అలాగే అన్నారాం సుందిళ్ల ప్రాజెక్టు పనులను కూడా చేపట్టినట్లు తెలిపారు. పునరుద్దారులకు సంబంధించి డిసైడ్ అండ్ డిజైన్ కన్సల్టెంట్ గా ప్రపంచ ప్రాముఖ్యత సంస్థ ఆయన ఆఫ్రిన్ అనే కంపెనీని సంప్రదించి అలాగే ఐఐటి బాంబే నిపుణులతో సంయుక్తంగా చేపట్టుటకు పనులు చేస్తున్నామని, అలాగే ఎన్ డి ఈ పరీక్షలు నిర్వహిస్తూ ఉపయోగవంతంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు మంత్రి.ఈ నెల చివరి వరకు లేదా జూలై మొదటి వారంలో అన్ని పరీక్షలు పూర్తి చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టడం జరిగిందని, వచ్చిన పరీక్షల నివేదిక ఆధారంగా బ్యారేజ్ పునరుద్ధరణ రీ డిజైనింగ్ చేయాలని సంకల్పించినట్లు మంత్రి తెలపడం జరిగింది. అలాగే డిజైనింగ్ అంతా సిద్ధంగా ఉన్న తదుపరి సిడబ్ల్యుసి మరియు ఎన్ డి ఏ అనుమతి తీసుకొని, వర్షాకాలం పూర్తి కాగానే నవంబర్ డిసెంబర్ మాసాల్లో పనులను ప్రారంభించి పనులు పూర్తి చేసే ప్రయత్నం జరుగుతుందని అలాగే వచ్చే సంవత్సరం ఎండాకాలం వరకు పనులు పూర్తి చేసే లక్ష్యంగా, నిర్దేశించినట్లు తెలిపారు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి.
కర్నల్ పరిషత్ మెహర చైర్మన్ ఆధ్వర్యంలో కార్యాచరణ.
మేడిగడ్డ పునరుద్ధారణ రీ డిజైనింగ్, ఎన్ డి ఏ, సి డబ్ల్యూ సి, నిర్వహించబడే కార్యక్రమాలను భారత సైన్యంలోని అత్యంత నైపుణ్యత అనుభవం కలిగిన కర్నూల్ పరిషత్ మెహర, చైర్మన్ ఆధ్వర్యంలో ముందుకు పోతున్నట్లు తెలిపారు మంత్రి, అలాగే కమిటీలు అనుభవతులైన చాలామంది దేశ విదేశాల నుండి నిపుణులను చేర్చి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, పరీక్షల పురోగతి మరియు తనిఖీ చేయుటకు నేడు సందర్శించినట్లు తెలిపారు మంత్రి. అలాగే పునరుద్ధరణ పనులు ప్రారంభించడానికి ముందు ప్రతి బ్యారేజ్ యొక్క ఫిజికల్ కండిషన్ పరిశీలించి సమస్యలు ఉంటే తక్షణ చర్యలు మరమ్మత్తు పనులు వేగవంతం చేసి కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు మంత్రి. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,ఎస్పి సిరి శెట్టి సంకీర్త్, శ్రీ శ్రీనివాస్ గుప్తా ,ఆర్డిఓ రవీందర్ ,ఇరిగేషన్ ఎస్సి దస్తగీర్, ఈ ఈ రమేష్ ,కన్సల్టెంట్ ఈ ఈ యాదగిరి, గ్రంథాలయ చైర్మన్ రాజబాబు, తహసిల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో సురేందర్. లు ఉన్నారు.



