తొలకరి జల్లుకు తడిసిన నెల, ఏరువాక కు స్వాగతం

తొలకరి జల్లుకు తడిసిన నెల, ఏరువాక కు స్వాగతం

‎ మృగ రాశి కార్తె రోజు భారీ వర్షం.

భారీ వర్షంతో వర్షాకాలం స్వాగతం పలికిన కార్తె.

‎ ఇక బానుడి పని సమాప్తం, ఊపిరి పీల్చుకున్న జనం.

కొనసాగుతున్న ఎదురు గాలులతో భారీ వర్షం.

మహాదేవపూర్ భూపాలపల్లి జూన్ 8 నిజం (బ్రేకింగ్ న్యూస్)

తొలకరి జల్లుకు నెల తడిసింది, గత 45 రోజులుగా భానుడి ప్రతాపంతో బిక్కుబిక్కుమన్న జనం మృగ రాశి కార్తి రోజు భారీ వర్షం కురవడంతో ఊపిరి పీల్చుకున్నారు మండల వాసులు. సోమవారం రోజు మృగశిర కార్తి కావడంతో, మండల వాసులు అలాగే రైతులు ప్రత్యేకంగా మృగశిర రోజు నుండి వర్షం కొరకు ఎదురుచూస్తున్న క్రమంలో, ఉదయం నుండి పెద్ద మొత్తంలో భానుడి ప్రతాపంతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజానికానికి సరిగ్గా 6:40 నిమిషాలకు, మృగ కారే లోకి ప్రవేశించడం జరిగిన కొద్దిసేపటికే, ఆకాశంలో మబ్బులంతా నిండి, భారీ ఎదురుగాలులు వీస్తూ, పెద్ద మొత్తంలో ఉరుములు మెరుపులతో ఒకేసారి భారీ వర్షం ప్రారంభం కావడం మృగశిర కార్తె తొలకరి జల్లుకు స్వాగతించి భారీ వర్షాన్ని కురిపించింది. అప్పటికే మండలమంతా భానుడి ప్రతాపానికి తట్టుకోలేక, వర్షం కొరకు ఎదురుచూస్తున్న ప్రజలకు, ప్రకృతి కనుకరించి మృగ రాశి కార్తిరోజే భారీ వర్షాన్ని కురవడం, ప్రజల్లో ఎంతో ఆనంద ఉత్సాహాన్ని కనబరిచింది. సుమారు 7:30 గంటల వరకు పెద్ద మొత్తంలో వర్షం కొనసాగడం తో వాతావరణంలో పెద్దగా మార్పు ఏర్పడింది. ఎటు చూసినా బారి ఉరుములతో ఆకాశమంత నల్లబడి, చిమ్మటి చీకటి కప్పి పెద్ద పెద్ద చినుకులు కురుస్తూ, అగ్నిగుండంలా ఉన్నటువంటి నేలను తొలకరి జల్లు రోజు కురిసిన వర్షం పూర్తిగా చల్లబడేసింది.

‎కొనసాగుతున్న ఎదురు గాలులతో భారీ వర్షం.

‎ మృగరాజు కార్తి రోజు ప్రారంభమైన తొలకరి జల్లు కురుస్తూ ప్రారంభమైన భారీ వర్షం, వాతావరణం లో మార్పుతో 7,34 నిమిషాల వరకు కూడా కొనసాగుతూనే ఉండడం,తో ప్రజలు మరియు రైతుల్లో ఆనందాన్ని వెళ్ళబోతుంది. కార్తీ మొదటి రోజు భారీ వర్షం కొరవడం,పంటల ప్రారంబానికి ఎంతో ఉపయోగపడుతుందని, ఈసారి పంటలు ముందుగా పండించుటకు కూడా, ఈ వర్షం ఎంతో తోడ్పడుతుందని చెబుతున్నారు రైతులు. 46 డిగ్రీల వరకు భానుని ఉష్ణోగ్రత కొనసాగిన గత 45 రోజుల్లో, అనేక ఇబ్బందులకు గురైన ప్రజలు, కార్తె ప్రారంభం రోజే పెద్ద మొత్తంలో వర్షం కురవడం,తో మృగ కార్తీ పై మరింత నమ్మకాన్ని పెంచింది. వర్షం కురుస్తున్న ప్రస్తుత పరిస్థితిని చూస్తే, అర్ధరాత్రి వరకు వర్షం కొనసాగేలా కనబడుతుంది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button