రైతులపై అరాచకం లో త్రిమూర్తుల దే విజయం.
కు లక్ష రూపాయలు కమిషన్ స్వాహా, లారీలు పెట్టకుండానే కాంట్రాక్టర్ ఖాతాలోకి కిరాయి డబ్బులు. ప్రభుత్వ ఆదేశాలు డోంట్ కేర్, మాటలకే పరిమితం. అధికారుల ప్రోత్సాహంతో అరాచకంపై నెగ్గిన కాంట్రాక్టర్, రైస్ మిల్.

రైతులపై అరాచకం లో త్రిమూర్తుల దే విజయం.
లారీ కు లక్ష రూపాయలు కమిషన్ స్వాహా,
లారీలు పెట్టకుండానే కాంట్రాక్టర్ ఖాతాలోకి కిరాయి డబ్బులు.
ప్రభుత్వ ఆదేశాలు డోంట్ కేర్, మాటలకే పరిమితం.
- అధికారుల ప్రోత్సాహంతో అరాచకంపై నెగ్గిన కాంట్రాక్టర్, రైస్ మిల్.
మహాదేవపూర్, భూపాలపల్లి: జూన్ 7( నిజం న్యూస్)
ధాన్యం కొనుగోలు రవాణా ప్రక్రియ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ కాటారం సబ్ డివిజన్ పరిధిలో, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అన్నపూర్ణ రైస్ మిల్, కొనుగోలు కేంద్రాల నిర్వహకుల అరాచకాలకు అమాయక రైతులు, వెళ్ళకింటల ధాన్యం తో పాటు, డబ్బులు వెచ్చించి ధాన్యం రవాణా చేసుకున్న చార్జీలు సైతం, రైతులకు అందకుండా కాంట్రాక్టర్ ఖాతాలోకి తరలించడం, రైతులకు ఒక్క లారీకి సుమారు 75 బస్తాల నుండి 105 బస్తాల వరకు, లక్ష రూపాయల నుండి 1,25,000 వరకు రైతుల డబ్బులను కూతచేసి వారి ఖాతాల్లోకి, పంపించడం జరుగుతుంది. సబ్ డివిజన్ పరిధిలో ధాన్యం రవాణా, కొనుగోలు వ్యవహారంలో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అన్నపూర్ణ రైస్ మిల్ తో పాటు కల్లాల నిర్వాహకు లైన ఈ త్రిమూర్తులకు, అధికారుల అండ పుష్కలంగా ఉండడంతో, సుమారు 45 రోజులపాటు, రైతులు జనలేని ఇబ్బందులకు గురవుతున్న అధికారులు మాత్రం, చర్యలు తీసుకోకుండా, సందర్శన పేరుతో రైతులకు అసలు సమస్య నుండి మళ్లించుటకు ప్రయత్నం చేయడంలో అధికారులు కూడా సఫలీకృతులు కావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రవాణా మరియు తరుగు పేరుతో కోతపై, ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పిన ఇక్కడ అధికారులు, ప్రభుత్వ ఆదేశాలకు లెక్కచేయకుండా వ్యవహరించడం, రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆదేశాలు అమలు అవుతాయన్న నమ్మకం సబ్ డివిజన్ పరిధిలోని ప్రజల్లో అలాగే రైతుల్లో లేకుండా చేశారు అది కాదు.
లారీ కు లక్ష రూపాయలు కమిషన్ స్వాహా,
కోత పేరుతో రైతులకు నష్టం వాటిల్లేలా చేస్తే రైస్ మిల్లు పై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఆనందంతో ప్రభుత్వంపై ఎంతో నమ్మకం కలిగి ఉన్న రైతులకు, అన్నపూర్ణ రైస్ మిల్లు మాత్రం ప్రభుత్వ ఆదేశాలు డోట్ కీర్ అనేలా చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గత నెల 21వ తేదీన, మహాదేవపూర్ మండలం నుండి నలుగురు రైతులు,946 బస్తాలు అన్నపూర్ణ రైస్ మిల్ కు పంపించడం జరిగింది. ట్రక్ షీట్ వెనుక రైస్ మిల్ నిర్వాహకులు,42,5 అని రాసి ఇచ్చారు, ధాన్యం కోత ఏమిటని, ప్రశ్నించినప్పటికీ ఇలాంటి సమాధానం లేదు, చివరికి రైతుకు ప్రభుత్వ ధర 2369 రూపాలు కింటలకు చొప్పున, 8 లక్షల 96 వేల రూపాయలు రావాల్సి ఉన్నప్పటికీ, రెండున్నర కిలోల చొప్పున కోత విధించి సుమారు 100 బస్తాల ధాన్యం రైతులకు నష్టం బాటిల్ లేదా చేసి, ఈనెల ఐదవ తేదీ శుక్రవారం రోజు నలుగురు రైతులకు సంబంధించి ఏడు లక్షల 86 వేల రూపాయలు, లక్ష రూపాయలు కట్ చేసి రైతు ఖాతాలోకి జమ చేయడం జరిగింది. అన్నపూర్ణ రైస్ మిల్ అక్రమంగా కోత పేరుతో వేల క్వింటాళ్ల ధాన్యాన్ని రైతులకు నష్టం వాటిల్లేల చేస్తుందని సాక్షాలతో స్థిరపైకి వచ్చిన జిల్లా అధికారులు రైస్ మిల్లు పై చర్యలు తీసుకోకపోవడం ఈరోజు ఆరుకాలం పండించిన పంటకు రైతులు లక్ష పైచిలుకు రూపాయలను రైతుల నుండి కమిషన్ పేరుతో దోచుకుంది అన్నపూర్ణ రైస్ మిల్.
లారీలు పెట్టకుండానే కాంట్రాక్టర్ ఖాతాలోకి కిరాయి డబ్బులు.
ధాన్యం రవాణా విషయంలో కాటారం మహదేవపూర్ సబ్ డివిజన్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం లారీలు లేకుండానే కాంట్రాక్ట్ అప్పజెప్పిన అధికారుల వ్యవహారం, రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిరసనలతో స్థిర పైకి రావడం జరిగింది. కానీ అధికారుల్లో మాత్రం కనీస చలనం రాలేదని, నాటి నుండి నేటి వరకు కాంట్రాక్టర్ కు అధికారులు వత్తాసు పలకడంతోనే రెచ్చిపోయిన కాంట్రాక్టర్, అడ్డదారులు తొక్కి అధికారులకు, ప్రైవేట్ వాహనాలు సమకూర్చేలా ఒత్తిడి చేయడం కూడా కండ్ల ఉంది జరిగింది. ఇక తాజాగా వింత విషయం, మండలంలోని రైతులు 940 బస్తాలు వేసి అన్నపూర్ణ రైస్ మిల్లుకు, బస్తాకు ₹10 చొప్పున ప్రైవేట్ లారీని సమకూర్చుకొని, ధాన్యం రవాణా చేసుకున్నారు, రైతు అసలు ధాన్యానికి ఎసరు పెట్టిన అన్నపూర్ణ రైస్ మిల్, ఇక ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ 12000 కిరాయి సంగతి రైతులకు బదులు కాంట్రాక్టర్ ఖాతాలోకి అధికారులు మళ్లించినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటికీ అనేక లారీలకు సంబంధించి, రవాణా చార్జీలను కాంట్రాక్టర్ ఖాతాలోకి మళ్లించడం జరగడంతో, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. తమకు రావాల్సిన లారీ కిరాయిని తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు రైతులు. అధికారుల ఇస్తారాజ్య వ్యవహారం కొనసాగడంతో, యాసంగి వరి ధాన్యం కొనుగోలు రవాణా వ్యవహారం అంతా, కమిషన్ల మాయలు రైతులకు నష్టం వాటిల్లేలా చేస్తుంది.
ప్రభుత్వ ఆదేశాలు డోంట్ కేర్, మాటలకే పరిమితం.
ప్రభుత్వ ఆదేశాలు వీడియో కాన్ఫరెన్స్ లు, జిల్లా ఉన్నత అధికారులకు కఠినంగా అమలుపరచాలని ప్రభుత్వం ఇచ్చిన వార్నింగ్ అంత మాటలకి పరిమితమైంది. అనడానికి మహాదేవపూర్ కాటారం సబ్ డివిజన్ పరిధిలో ధాన్యం కొనుగోలు రవాణా వ్యవహారమే సాక్ష్యం. ధాన్యం కూత లేదు అని చెప్పిన ప్రభుత్వం, ఇక్కడ అలాట్మెంట్ పొందిన అన్నపూర్ణ రైస్ మిల్ సుమారు లక్షల కింటల్లా ధాన్యాన్ని కోత విధించడం పై అధికారుల నిశ్శబ్దం ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసినట్టా, ప్రత్యేకంగా ధాన్యం రవాణా విషయంలో లారీలు లేని కాంట్రాక్టర్లు నియమించి, పది రూపాయల నుండి 15 రూపాయల వరకు రైతులు సొంత డబ్బులు వెచ్చించి, ధాన్యం రవాణా చేసుకున్న తర్వాత, అదే లారీల కిరాయి మాత్రం రైతులకు అందించకుండా, ప్రభుత్వ ఖజానాకు ఎసరు పెట్టేలా, కాంట్రాక్టర్ ఖాతాలోకి మళ్ళించడం, ఇప్పటికీ సుమారు 2000 లారీల ధాన్యం రవాణా జరిగితే వాటిలో 1000 కి పైచిలుకు లారీలు స్వయంగా రౌత్ రైతులే పంపించుకుంటే లారీ కిరాయి ఎవరి ఖాతాలోకి రావాలి, ఇక కొనుగోలు కేంద్రాల్లో పారిదానుల కొరత, తార్పాల్ అందించకుండా, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యానికి ఎలాంటి రక్షణ లేకుండా, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయడం, వాటిని రైతుల పేర్ల మీద ట్రక్ షీట్లను ఏర్పాటుచేసి, మిల్లుకు తరలించడం, అసలైన రైతు ధాన్యం కోత విధించడంలో, కొనుగోలు కేంద్రాల నిర్వహకులతోపాటు అన్నపూర్ణ రైస్ మిల్ ప్రధాన పాత్ర ఉండటం, ఇలా అనేక అక్రమాలు యదేచ్చగా ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా, ప్రజా ప్రభుత్వం పై బురదజల్లే విధంగా అధికారులు కాంట్రాక్టర్ మరియు రైస్ మిల్ తో పాటు కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు పరోక్షంగా సహకరించడం జరిగిందని చెప్పడానికి అనేక సాక్షాలు తెరపైకి రావడం జరిగింది. అంటే ప్రభుత్వ ఆదేశాలకు కూడా అధికారులు పాటించలేదని స్పష్టంగా కనబడింది. నాటి నుండి నేటి వరకు రైతుల ఖాతాల్లో మాత్రం, లక్షల రూపాయలు కమిషన్ పేరుతో సొమ్ము చేసుకుని జమ చేయడం, లారీ కిరాయి మాత్రం కాంట్రాక్టర్ ఖాతాలో పడడం దీనికంటే సాక్ష్యం మరి ఏమి ఉండదు.



