వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద అధికార పార్టీ పేత్తనం.

బార్ధాన్లు అన్నీ అధికార పార్టీ వ్యక్తులకె.

‎‎చిన్న రైతులకు బస్తాకు పది రూపాయల రవాణా చార్జీ లేదంటే నో.

‎సాధారణ రైతులకు గండం గా మారిన సూరారం కొనుగోలు కేంద్రం.

మంత్రి మరియు జిల్లా కలెక్టర్ తమకు న్యాయం చేయాలి. రైతులు.

మహాదేవపూర్ ,భూపాలపల్లి:

‎సూరారం వడ్ల కొనుగోలు కేంద్రం కేవలం అధికార పార్టీ కు సంబంధించిన రైతులకు అలాగే వారి సన్నిహితులకు మాత్రమే, వార్ధాన్లు అందించడం లేదా వారి ధాన్య బస్తాలను రవాణా చేయడం జరుగుతుందే తప్ప, పార్టీలకు సంబంధం లేని చిన్న సన్నకార రైతులకు మాత్రం సూరారం పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించబడే వడ్ల కొనుగోలు కేంద్రం శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేద రైతులు. శనివారం రోజు కొనుగోలు కేంద్రం వద్ద పెద్ద మొత్తంలో చిన్న రైతులు చేరి తమకు బార్ధాలు ఇవ్వకపోవడం తమ ధాన్యాన్ని రవాణా చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు, అనంతరం గత 20 రోజులుగా చిన్న పేద రైతులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ పత్రిక ప్రకటన జారీ చేశారు కొందరు రైతులు. నలుగురు వ్యక్తులు కలిసి సూరారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించుటకు అధికార పార్టీ నుండి ఒప్పందం చేసుకొని 20 రోజులుగా, అధికార పార్టీ వ్యక్తులతో పాటు వారి బంధువులకు అలాగే, వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తులకు బార్ధాన్లు అందించడం జరిగిందని. ఇప్పటికీ 37వేల చిల్లర వార్ధాలు వచ్చినప్పటికీ, పేద రైతులకు ఇవ్వకుండా వారి దగ్గరికి ఇవ్వడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. అలాగే శుక్రవారం రోజు ధాన్యం రవాణా కొరకు రెండు లారీలను పంపించి, పేద రైతుల ధాన్యం రవాణా కొరకు బస్తాకు పది రూపాయలు ఇస్తేనే రవాణా చేస్తామని, లేదంటే మీ ధాన్యం ఇక్కడే ఉంటుందని, అనడంతో ఆగ్రహించిన రైతులు, ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ వెసులుబాటు కల్పించినప్పటికీ బస్తాకు పది రూపాయల చొప్పున రైతుల నుండి వసూలు చేయడం ఎక్కడి వరకు సమంజసం అని ప్రశ్నించి నిరాకరించడంతో పేద రైతుల ధాన్యాన్ని తీసుకు వెళ్లకుండా లారీలను పంపించడం జరిగిందని ఆగ్రహించారు రైతులు. సూరారం పరిధిలోని చిన్న పేద సన్నకార రైతుల కు అధికార పార్టీ పేరుతో, ఇబ్బందులకు గురిచేసి, ధాన్యాన్ని రవాణా చేయకుండా అలాగే బార్ధాన్లు అందించకుండా, వర్షాకాలం సమీపిస్తున్న క్రమంలో పేద రైతు కుటుంబాలు రోడ్డున పడేసేలా, చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరియు జిల్లా కలెక్టర్, తక్షణమే స్పందించి నిర్వాహకులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ పై తక్షణమే చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు రైతులు. సుమారు 20 కి పైచిలుకు రైతులు కొనుగోలు కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button