సమస్యల పరిష్కారం కోసం పాత్రికేయులు.

‎పాత్రికేయుల అభ్యున్నతి కోరకు కృషి. ‎ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడు

సమస్యల పరిష్కారం కోసం పాత్రికేయులు.

‎పాత్రికేయుల అభ్యున్నతి కోరకు కృషి.

‎ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడు.

మహాదేవపూర్, భూపాలపల్లి :మే 15( నిజం న్యూస్)

‎ప్రజల సమస్యలను పరిష్కారం కోసం నిష్పక్షంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే లక్ష్యంతో మహాదేవపూర్ ప్రెస్ పాత్రికేయులు ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉందాలని,అన్నారు మహాదేవపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మిన్నుభాయ్.గురువారం  రోజు మహాదేవపూర్ ప్రెస్ క్లబ్ మొదటి సర్వసభ్య సమావేశాన్ని ప్రెస్ క్లబ్ పరిధిలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, సభ్యులు అలాగే కార్యవర్గం సమక్షంలో సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి అధ్యక్షుడు మాట్లాడుతూ, మహాదేవపూర్ ప్రెస్ క్లబ్ ప్రజల సమస్యల సమస్యల పరిష్కార దిశలో, ప్రెస్ క్లబ్ పరిధిలోని పాత్రికేయులు, బాధ్యత రహితంగా వ్యవహరించడం తోనే, ఈరోజు మండల ప్రజల్లో, పాత్రికేయులకు అలాగే ప్రెస్ క్లబ్ కు ప్రజల్లో, ఒక బలమైన నమ్మకాన్ని నిలబెట్టిందని అన్నారు. మండల ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంలో, ప్రెస్ క్లబ్ మరింత బాధ్యత రహితంగా వ్యవహరిస్తుందని,ఎలిపరు. ప్రజలు తమ సమస్యలు, అందుబాటులో ఉన్న పాత్రికేయుల దృష్టికి తీసుకురావాలని అధ్యక్షులు మిన్ను భాయ్ కోరారు. అలాగే ప్రెస్ క్లబ్ పరిధిలోని పాత్రికేయుల, మరియు ప్రెస్ క్లబ్ అభ్యున్నతి కొరకు, తమ వంతు కృషి చేయడం జరుగుతుందని, గత ప్రభుత్వం పాత్రికేయులకు కేటాయించిన నివాస స్థలాల సమస్య సాధ్యమైనంత త్వరలో, పరిష్కరించే దిశగా, గౌరవ మంత్రి తో పాటు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అటవీ అధికారి గారికి కలిసి నివాస స్థల సమస్యను పరిష్కరించుటకు కోరడం జరుగుతుందని అన్నారు. వార్తల ప్రచురణ విషయంలో పాత్రికేయులు నిర్భయంగా, నిష్పక్షమైన వార్తల ప్రచురణకు ప్రెస్ క్లబ్ ఎల్లప్పుడూ వారికిఅండగా  ఉంటుందని, భరోసా కల్పించారు అధ్యక్షుడు. ప్రెస్ క్లబ్ పరిధిలో ని పాత్రికేయ వృత్తిలో, కుల మతాలకు అతీతంగా వ్యవహరించడం జరుగుతుందని,ప్రతి జర్నలిస్టుకు సమాన విలువలతో అందరూ ప్రెస్ క్లబ్ సభ్యులుగా గౌరవించడం జరుగుతుందని, స్పష్టం చేశారు,అనేక సంవత్సరాలుగా పాత్రికేయుల వృత్తిలో కొనసాగుతూ, ప్రజల వద్ద ఒక భరోసా పొందిన సీనియర్ పాత్రికేయులగా ప్రెస్ క్లబ్ వారికి గుర్తిస్తూ సముచిత స్థానం, తోపాటు ఉన్నతమైన గౌరవాన్ని అందించడం జరుగుతుందని అన్నారు అధ్యక్షులు. ఈ సమావేశంలో, పాత్రికేయ నిబంధనలు, వారి బాధ్యతల తో పాటు, ప్రెస్ క్లబ్ అభ్యున్నతి, కొరకు పలు తీర్మానాల చేయడం జరిగింది.‎సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు ప్రెస్ క్లబ్ సభ్యులు. ఈ సర్వసభ్య సమావేశంలో. గౌరవ అధ్యక్షుడు, ఎస్ డి జమీల్, ఉపాధ్యక్షుడు దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి షఫీ, కార్యవర్గ సభ్యులు పాత్రికేయులు, అయిత రాజిరెడ్డి అనిల్ కుమార్, శ్రీనివాస్, భాస్కర్ మునవర్ సంతోష్ సుశాంత్ అర్జున్ నగేష్ అన్వర్ లు ఉన్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button