ఏసీబీ వలలో చర్ల ఇంచార్జీ డీఆర్వో
చర్ల ఇంచార్జీ డీఆర్వో ఆర్ కృష్ణయ్య ఏసీబీ వలలో చిక్కారు.భద్రాచలం ఎఫ్ డీ ఓ తో కలిసి 3.5 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

– భద్రాచలం ఎఫ్ డీ ఓ తో కలిసి ఏసీబీకి పట్టుబడిన కృష్ణయ్య
చర్ల,మే 07(నిజం చెపుతాం) చర్ల ఇంచార్జీ డీఆర్వో ఆర్ కృష్ణయ్య ఏసీబీ వలలో చిక్కారు.భద్రాచలం ఎఫ్ డీ ఓ తో కలిసి 3.5 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.
వివరాల్లోకి వెళితే చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో రోడ్డు వేస్తున్న క్రమంలో అటవీ శాఖకు చెందిన కొన్ని చెట్లు దెబ్బతిన్నాయి.ఈ క్రమంలో చర్ల ఇంచార్జీ డీఆర్వో, భద్రాచలం ఎఫ్ డీ ఓలు కలిసి కేసు నమోదు చెయ్యకుండా ఉండడానికి కాంట్రాక్టర్ వద్ద పది లక్షలు రూపాయలు డిమాండ్ చేశారు.
ముందుగా 3.50 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్న సదరు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు.వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో 3.50 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ప్రస్తుతం ఈ విషయం భద్రాచలం డివిజన్ లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఇంచార్జి డీఆర్వో పాలనలో చర్ల అటవీ శాఖలో అవినీతి తారాస్థాయికి చేరిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి….



