నీటి వృథాను తగ్గించేందుకు జలమండలి సేవ్ వాటర్ వాలంటీర్

 జలమండలి హైదరాబాద్ లో నీటి వృథాను తగ్గించేందుకు.. బాధ్యతాయుత నీటి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు “సేవ్ వాటర్ వాలంటీర్” కార్యక్రమాన్ని ప్రారంభించింది.

 జలమండలి హైదరాబాద్ లో నీటి వృథాను తగ్గించేందుకు.. బాధ్యతాయుత నీటి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు “సేవ్ వాటర్ వాలంటీర్” కార్యక్రమాన్ని ప్రారంభించింది.

కార్యక్రమం ముఖ్యాంశాలు:

1. HMWSSB వెబ్‌సైట్ ద్వారా వాలంటీర్ల ఆన్‌లైన్ నమోదు

2. నీటి వృథా సంఘటనలను నివేదించేందుకు మొబైల్ యాప్

3. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించే అమలు విధానం

నమోదుకు అవసరమైన వివరాలు:

 పేరు 

చిరునామా 

మొబైల్ నంబర్

ఫోటోగ్రాఫ్ 

చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ ప్రూఫ్ సమర్పించిన దరఖాస్తులను HMWSSB పరిశీలించి, అర్హులైన వాలంటీర్లను ఎంపిక చేసి కార్యక్రమంలో చేర్చుతుంది.

మొబైల్ యాప్ & ఫిర్యాదు ప్రక్రియ:

1. ధృవీకరించిన వాలంటీర్లకు ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ యాక్సెస్ ఇవ్వబడుతుంది.

2. నీటి వృథా సంఘటనలను ఫోటో ఆధారాలతో అప్లోడ్ చేయవచ్చు.

3. ఫిర్యాదులు OTP ద్వారా ధృవీకరిస్తారు

4. ధృవీకరించిన ఫిర్యాదులపై జలమండలి అధికారులు సమీక్ష చేసి అవసరమైన చర్యలు తీసుకుంటారు.

జరిమానాలు & ప్రోత్సాహకాలు:

 ధృవీకరించిన ఫిర్యాదులు సంబంధిత వినియోగదారుడి CAN కు అనుసంధానం చేసి లెడ్జర్‌లో నమోదు చేస్తారు.  తగిన జరిమానాలు విధించబడతాయి మరియు సంబంధిత వినియోగదారుడికి సమాచారం పంపబడుతుంది.  చురుకుగా పాల్గొనే వాలంటీర్లకు ప్రోత్సాహకాలు అందించబడతాయి.

HMWSSB అధికారిక వెబ్‌సైట్ (hyderabadwater.gov.in⁠) లోని “Quick Links” విభాగంలో “SAVE WATER Volunteer Registration” లింక్ అందుబాటులో ఉంది.

ఈ కార్యక్రమంలో పౌరులు చురుకుగా పాల్గొని నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని, నీటి భద్రతతో కూడిన హైదరాబాద్ నిర్మాణానికి తోడ్పడాలని కోరుతున్నాము.

నీటి నల్లాలకు మోటార్లను బిగించి అక్రమంగా నీటిని తోడుతున్న వారికి జరిమానా విధించడానికి, జలమండలి సరఫరా చేస్తున్న నీటిని తాగు నీటికి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించే వారి పై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకమైన ఈ మొబైల్ యాప్ ను రూపొందించింది.

ఈ యాప్ ద్వారా నీటి నల్లాలకు మోటార్లను బిగించినా, తాగడానికి కాకుండా ఫ్లోర్లు కడగడం, వాహనాలు శుభ్రం చేయడం, గార్డెనింగ్, ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఓవర్ ఫ్లో, నిర్మాణ పనుల కోసం నీటిని వృధా చేస్తే జరిమానా విధించడానికి ఈ యాప్ ని రూపొందించారు.

వాలంటీర్ ఆ ప్రాంతాల్లో ఇల్లీగల్ మోటార్లను బిగించి అక్రమంగా నీటిని తోడుతున్న వారిని, నీటి వృధా చేస్తున్న వినియోగదారులను గుర్తించి ఫోటో తో సహా యాప్ లో అప్లోడ్ చేయడం.. సదరు కనెక్షన్ గుర్తించి ట్యాగ్ చేయడం తో వెంటనే ఆ కన్స్యూమర్ కనెక్షన్ నెంబర్ పై జరిమానా వేయడంతో సదరు వినియోగదారుడి కనెక్షన్ అకౌంట్ కు పెనాల్టీ జమ అవుతుంది. అలాగే ఈ మొత్తం వచ్చే నెల బిల్ లో చెల్లించేలాగా రూపొందించారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button