అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ జారీ..

జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్.ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు

  • నిరంతరం అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ
  • సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక
  • మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, ఏప్రిల్, 07(నిజం న్యూస్ )
  • దరఖాస్తుల ప్రక్రియపై ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై జర్నలిస్టులు ఎటువంటి ఆందోళన చెందవద్దని కమిషనర్ ఆ ప్రకటనలో.. పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను ఈ నెల 10 వ తేదీన,జరిగే రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో స్ర్కూట్నీ చేసి అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులను మంజూరి చేస్తూ..నూతన కార్డులు జారీ చేయడం జరుగుతుందని,అర్హులైన జర్నలిస్టు ఆన్లైన్ లో తమ దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవాలని,ఏప్రిల్ మాసంలో అక్రడేషన్ జారీ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని, కమిషనర్ సిహెచ్. ప్రియాంక ప్రకటనలో తెలిపారు.అదే విధంగా జిల్లా స్థాయిలో కూడా, ఈనెలలోనే జిల్లా కమిటీలు సమావేశాలు ఏర్పాటు చేసి అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ లు జారీ చేయడం జరుగుతుందని, కావున జిల్లాలో జిల్లా స్థాయి దరఖాస్తు చేసుకొనే అర్హులైన జర్నలిస్టులు వెంటనే తమ దరఖాస్తులను ఆన్లైన్లో చేసుకోవాలని ఆమె ఆ ప్రకటనలో కోరారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button