అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ లింగయ్య
జిల్లా పోలీస్ శాఖకు చెందిన పి.సి. 182 ఎం. లింగయ్య క్రీడల్లో దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతూ జిల్లాకు గర్వకారణంగా నిలుస్తున్నారు.

ఎస్పీ డా, శబరిష్ – మహబూబాబాద్‌కు గర్వకారణం
మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, మార్చి, 24,(నిజం న్యూస్ )
జిల్లా పోలీస్ శాఖకు చెందిన పి.సి. 182 ఎం. లింగయ్య క్రీడల్లో దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతూ జిల్లాకు గర్వకారణంగా నిలుస్తున్నారు.
పలు ప్రతిష్టాత్మక పరుగుపందేలలో విశిష్ట విజయాలు సాధించి తన ప్రతిభను నిరూపించారు.
ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ లింగయ్యను అభినందిస్తూ ఆయన క్రీడాస్ఫూర్తి, అంకితభావాన్ని ప్రశంసించారు.
లింగయ్య సాధించిన ముఖ్య విజయాలు:
అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్:
చండీగఢ్ ఇంటర్నేషనల్ మారథాన్ (21 కి.మీ) – 3వ స్థానం (01:12:00)
ఎన్ఎండీసీ ఫుల్ మారథాన్ (42.195 కి.మీ) – 4వ స్థానం (02:44:00)
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్ (10 కి.మీ) – 1వ స్థానం (32:57)
జాతీయ స్థాయి ఈవెంట్స్:
ఆల్ ఇండియా పోలీస్ ఫుల్ మారథాన్, జలంధర్ – 5వ స్థానం (02:39:00)
ఇండియన్ నేవీ మారథాన్, విశాఖపట్నం – 1వ స్థానం (01:12:00)
వైజాగ్ మారథాన్ – 3వ స్థానం (01:13:00)
పోలీస్ స్పోర్ట్స్ మీట్ 2026 (హైదరాబాద్):
ఫుల్ మారథాన్ – 1వ స్థానం (02:40:00)
క్రాస్ కంట్రీ (10 కి.మీ) – 2వ స్థానం (33 నిమిషాలు)
10,000 మీటర్లు – 2వ స్థానం (34 నిమిషాలు)
రాష్ట్ర స్థాయి ఈవెంట్స్:
తెలంగాణ స్టేట్ క్రాస్ కంట్రీ (హైదరాబాద్) – 3వ స్థానం (32 నిమిషాలు)
యాదగిరి గుట్ట టెంపుల్ రన్ – 1వ స్థానం (01:12:00)
కరీంనగర్ హాఫ్ మారథాన్ – 3వ స్థానం (01:14:00)
థానుకూ రోడ్ రన్ (ఏపీ) – 1వ స్థానం (31:56)
ఈ రోజు లింగయ్య ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి తమ విజయాలను వివరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, క్రీడల పట్ల యువత ఆసక్తి పెంపొందించుకుని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరచుకోవాలని సూచించారు.
లింగయ్య విజయాలు యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.జిల్లా పోలీసు శాఖ తరఫున లింగయ్య గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.



