జిల్లాలో 3 రూరల్ అన్న కాంటీన్లు ప్రారంభించేందుకు సిద్దం….
జిల్లాలో రబీ పంటల అవసరాలకు ఈ నెలాఖరు వరకూ నీటి విడుదలకు నిర్ణయించినప్పటికీ, పంటలకు నీటి అవసరం పూర్తయినందున నీటి విడుదల ముందే ఆపి, నిర్వహణ పనుల చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించామని తెలిపారు.

వాట్సాప్ గవర్నెన్స్ సేవల వినియోగంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచండి
జిజిహెచ్ లో మరో రెండు అన్నాకాంటీన ఏర్పాటుకు ప్రతిపాదన*
ఎస్సి, ఎస్టీ కుటుంబాలకు పియం సూర్యఘర్ ముఫ్త్ యోజన ద్వారా ఉచిత సోలార్ వ్యవస్థల ఏర్పాటు ప్రక్రియ ముమ్మరం చేయండి
జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ఇన్చార్జి మంత్రి పొంగూరు నారాయణ
కాకినాడ మార్చి 23 (నిజం ప్రతినిధి):
కాకినాడ జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో సోమవారం జరిగింది.
జిల్లా అభివృద్ది సమీక్షలో తొలుత గత సమావేశంలో చర్చించిన అంశాలపై చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి మంత్రికి వివరించారు.
అనంతరం అజెండా ఆంశాలుగా వ్యవసాయం, ధాన్యం సేకరణ, నీటి పారుదల, ఉపాధి హామీ, గ్రామీణ నీటి సరఫరా, పురపాలన, విద్యుత్, పశు సంవర్థక శాఖల ద్వారా అభివృద్ది, సంక్షేమ పధకాల అమలపై ఇంచార్జి మంత్రి నారాయణ అధికారులతో సమీక్షించి అయా లక్ష్యాల సత్వర సాధనకు అధికారులకు కార్యాచరణలు సూచించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా సమీక్ష కమీటీ సమావేశంలో సమీక్షించిన వివిధ అంశాలను మీడియా ప్రతినిధులకు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ ద్వారా గత సీజనులో రైతులకు మద్దతు ధర కల్పిస్తూ ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, వచ్చే మార్కెటింగ్ సీజన్ లో కూడా మరింత సమర్థవంతంగా ధాన్యం సేకరణ జరపాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు.
జిల్లాలో రబీ పంటల అవసరాలకు ఈ నెలాఖరు వరకూ నీటి విడుదలకు నిర్ణయించినప్పటికీ, పంటలకు నీటి అవసరం పూర్తయినందున నీటి విడుదల ముందే ఆపి, నిర్వహణ పనుల చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించామని తెలిపారు.
కాకినాడ జిల్లాలో పట్టణ ఆవాసాల్లో మొత్తం 1,70,523 కుటుంబాలు ఉండగా ఇప్పటి వరకూ 28,223 కుటుంబాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలను ప్రజల అరచేతిలోకి తెస్తూ అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ గురించి అవగాహన పొంది, వినియోగిస్తున్నారని, సౌలభ్యవంతమైన ఈ సేవలపై పట్టణాల్లో మిగిలిన కుటుంబాలతో బాటు, గ్రామీణ కుటుంబాలలో కూడా అవగాహన పెంపొందించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.
పియం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకూ 6,763 కుటుంబాలు ఇంటి కప్పులపై సోలార్ విద్యుత్ పానెళ్లు ఏర్పాటు చేసుకున్నారని, వీటి ద్వారా 21,696 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పాదన జరుగుతోందని మంత్రి తెలిపారు.
ఎస్.సి, ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా ఈ సోలార్ పానెళ్లు ఏర్పాటు చేస్తున్నామని, జిల్లాలో మొత్తం 19,593 ఎస్.సి., ఎస్టీ కుటుంబాలు ఉండగా ఇప్పటి వరకూ 524 మంది ఈ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారని, మిగిలిన కుటుంబాలకు సౌర విద్యుత్ పధకం ప్రయోజనాలను వివరించి లబ్దిపొందేలా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు.
జిల్లాలో అర్బన్ ప్రాంతాలలో ప్రస్తుతం 11 అన్న కాంటీన్లు విజయవంతంగా నిర్వహిస్తుండగా, జగ్గంపేట, తిమ్మాపురం, ఉప్పాడ కొత్తపల్లి లలో మరో మూడు గ్రామీణ అన్న కాంటీన్ల నిర్మాణాలు పూర్తయిలో త్వరలో ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.
అలాగే ఎమ్మెల్యేలు సూచనలపై కాకినాడ జిజిహెచ్ లోను, పెద్దాపురం నియోజక వర్గం పరిధిలోని దివిలిలోను మరో 2 అన్నా క్యాంటీన్ లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు సూచించామన్నారు.
జగ్గంపేట నియోజక వర్గంలో పారిశ్రామిక అవసరాల కొరకు గుర్తించిన 450 ఎకరాల భూముల అభివృద్దికి ప్రణాళికను చర్చించి, పోలవరం ఎడమ కాల్వ నిర్మాణంలో సాయిల్ బ్యాంక్ కోసం సేకరించిన భూములను, పేదల ఇళ్ల స్థలాల కొసం వినియోగంలోకి తెచ్చే అంశంపై ఇరిగేషన్ శాఖ నుండి బదలాయింపుకు కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలను కోరాలని నిర్ణయించామన్నారు.
గత ప్రభుత్వ నిర్వాకంతో పేరుకు పోయిన లెగసీ వ్యర్థాల తరలింపు ప్రక్రియ జిల్లాలో కాకినాడ, ఏలేశ్వరం పట్టణాల్లో ఇంకా పూర్తి కావలసి ఉందని, జూన్ నెలలోపు ఈ వ్యర్థాల తొలగింపు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు.



