తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..ఉరుములు, మెరుపులతో కూడిన వానలు
వచ్చే రెండు రోజుల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది

తెలంగాణ రాష్ట్రంలో ఎండల వల్ల ఉక్కపోతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి వార్తను తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది.
ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని రైతులు చెట్ల కింద ఉండవద్దని హెచ్చరించారు.
హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్ వంటి పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, వడగళ్ల వానలకు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.



