పర్యావరణ సమతుల్యత సాధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా న‌ర్సరీల ఏర్పాటు

పోడు వ్యవసాయం, గృహ వినియోగం వంటి కారణాలతో అడవులు అంతరించి పోతున్నాయని, ఇది ఇలాగే కొన‌సాగితే జీవుల మనుగడకే ప్రమాదం అని వారు ఆందోళ‌న వ్యక్తం చేశారు.

వనాల‌తోనే మానవాళి సంక్షేమం.

బయ్యారం:మార్చి.21.(నిజం చెపుతాం )

ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా బయ్యారం మండల కేంద్రంలో అట‌వీ శాఖ ఆధ్వర్యంలో శనివారం అటవీ శాఖ ఆఫీస్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా డిఆర్ఓలు మాట్లాడుతూ అడవుల రక్షణ, విస్తరణ,మొక్కలు నాటడం, చెట్ల పెంపకం, వన్యప్రాణుల సంరక్షణ‌, జీవివైవిధ్యాన్ని కాపాడ‌టం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంద‌న్నారు.

మానవుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధికి అడవులు ఎంతో అవసరమని పేర్కొన్నారు.

పోడు వ్యవసాయం, గృహ వినియోగం వంటి కారణాలతో అడవులు అంతరించి పోతున్నాయని, ఇది ఇలాగే కొన‌సాగితే జీవుల మనుగడకే ప్రమాదం అని వారు ఆందోళ‌న వ్యక్తం చేశారు.

భ‌విష్యత్‌ త‌రాల అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ సమతుల్యత సాధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా న‌ర్సరీల ఏర్పాటు, ప‌ల్లె, ప్రకృతి వ‌నాల ద్వారా ప‌చ్చదనం పెంచ‌డం, వన్యప్రాణుల అభయారణ్యాల్లో ఎకోసిస్టాన్ని పెంపొందించ‌డం ద్వారా అడవులు జీవ వైవిధ్యాన్ని కాపాడ‌టం కోసం ఎన్నో కార్యక్రమాలను చేప‌డుతున్నామ‌న్నారు.

అడ‌వుల ప‌రిరక్షణలో అట‌వీ అధికారులు,సిబ్బంది నిరంత‌రం కృషి చేస్తున్నార‌న్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button