దివ్యాంగ శక్తి కి శ్రీకారం: రేపటి నుండే ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం!
రేపటి నుండే (మార్చి 18, 2026) రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన వారు ఈ పథకానికి అర్హులు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం దిశగా మరో చారిత్రాత్మక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు గుంటూరులో ‘దివ్యాంగ శక్తి’ (ఇంద్రధనుస్సు) పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
రేపటి నుండే (మార్చి 18, 2026) రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది.
40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన వారు ఈ పథకానికి అర్హులు.
పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ మరియు సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చు.
దివ్యాంగుల వెంట వచ్చే ఒక సహాయకుడికి టికెట్ ధరలో 50 శాతం రాయితీ వర్తిస్తుంది.
ప్రయాణ సమయంలో ప్రభుత్వం జారీ చేసిన సదరం (SADAREM) సర్టిఫికేట్ లేదా స్మార్ట్ కార్డ్ లేదా ఆర్టీసీ పాస్‌ను కండక్టర్‌కు చూపించి ‘జీరో టికెట్’ పొందవచ్చు.



