నిజమైన అర్హులకి మొండి చేయి…పేదలకు అన్యాయం చేసిన అధికారులు..!
హుజూర్ నగర్ నియోజకవర్గంలో సింగిల్/ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందంటూ లబ్ధిదారులు రోడ్డెక్కారు. సోమవారం హుజూర్ నగర్ ఆర్డీవో (RDO) కార్యాలయం ముందు బాధితులు భారీ నిరసన చేపట్టారు.

హుజూర్ నగర్లో సింగిల్ బెడ్ రూమ్ ‘ఇళ్ల’ సెగ..
ఆర్డీవో కార్యాలయం ముందు లబ్ధిదారుల భారీ *…!
అర్హులైన పేదలకు నీడ కల్పించాల్సిన ప్రభుత్వ పథకం, అధికారుల నిర్లక్ష్యం వల్ల అభాసుపాలవుతోంది.
హుజూర్ నగర్ నియోజకవర్గంలో సింగిల్/ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందంటూ లబ్ధిదారులు రోడ్డెక్కారు.
సోమవారం హుజూర్ నగర్ ఆర్డీవో (RDO) కార్యాలయం ముందు బాధితులు భారీ నిరసన చేపట్టారు.
ఇళ్ల స్థలాల వెరిఫికేషన్ బాధ్యతను ఉన్నతాధికారులు ఆర్పీలకు (RPs) అప్పగించడం ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువైంది.
క్షేత్రస్థాయిలో సర్వే చేసిన ఆర్పీలు పక్షపాతంగా వ్యవహరించారని, అర్హత ఉన్న తమను జాబితా నుండి తొలగించి, అన్యాయం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్ని అర్హతలు ఉన్నా మాకు ఇళ్లు ఎందుకు కేటాయించలేదు?” అంటూ బాధితులు అధికారులను నిలదీశారు.
ఇప్పటికే సొంత ప్లాట్లు, ఇళ్ల స్థలాలు ఉన్నవారికే మళ్లీ ఇళ్లను కేటాయించారని, ఇది పేదలను వంచించడమేనని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తమకు ఇళ్లు కేటాయించే వరకు, ఈ సమస్యకు పరిష్కారం దొరికే వరకు కార్యాలయం వదిలి వెళ్లే ప్రసక్తే లేదని లబ్ధిదారులు కార్యాలయం ముందు బైఠాయించారు.
పేదల సొంతింటి కలను కొందరు అధికారుల నిర్లక్ష్యం, ఆర్పీల అనాలోచిత సర్వేలు నీరుగారుస్తున్నాయి.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పునఃసమీక్ష జరపకపోతే ఈ సెగ మరింత పెరిగే అవకాశం ఉంది.



