ఎంపీ సార్ అంతర్ జిల్లాల బ్రిడ్జి నిర్మించండి ప్లీజ్..?
ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల సుమారు మూడు జిల్లాల రహదారి సమస్య పరిష్కారం అవుతుందని స్థానికులు తెలుపుతున్నారు. అల్లూరు జిల్లా, మన్యం జిల్లా, విజయనగరం జిల్లా ల ప్రజలకు ఎంతగానో ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఉపయోగపడుతుందని వారు తెలుపుతున్నారు.

అనంతగిరి నిజం చెపుతాం న్యూస్
అనంతగిరిమండల పరిధిలో అల్లూరి జిల్లాగరుగుబిల్లి పంచాయతీ శివారు లో విజయనగరం జిల్లా ఆండ్రాకు వెళ్లే రహదారిలో ఉన్న వాగు పై నిధులు కేటాయించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అరకులోయ ఎంపీకి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల సుమారు మూడు జిల్లాల రహదారి సమస్య పరిష్కారం అవుతుందని స్థానికులు తెలుపుతున్నారు. అల్లూరు జిల్లా, మన్యం జిల్లా, విజయనగరం జిల్లా ల ప్రజలకు ఎంతగానో ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఉపయోగపడుతుందని వారు తెలుపుతున్నారు.
గతంలో సగనిర్మాణం చేపట్టి వదిలేశారని ఇప్పుడు మిగిలిన భాగం పూర్తి చేస్తే ఈ రహదారి ప్రజలకు అందుబాటులోకి వస్తూ సమయం రాధా అవుతుందని వేరే పేర్కొన్నారు.
ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా అంతర్ జిల్లాల సరిహద్దుల్లో ఉండడం వల్ల ఏ జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని అన్ని జిల్లాల నాయకులు అయినా అరకులోయ పార్లమెంటు సభ్యులు తనుజరాణి దృష్టిసారించి ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎంపీ నిధులు కేటాయించాలని కోరారు.
విజయనగరం వెళ్లే వారికి ఈ రహదారి ఎంత ఉపయోగకరంగా ఉంటుందని వర్షాకాలం వస్తే పూర్తిగా నీరు నిండిపోయి వరద ఎక్కువగా ఉంటుందన్నారు దానివల్ల రాకపోకలకు ఇబ్బంది కలిగి ఎవరు కూడా సాహసం చేయడం లేదు.
ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రదేశాన్ని అనంతగిరి మండల పరిషత్ అధ్యక్షురాలు మితుల, మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షులు కోర్ర సూర్యనారాయణ, గుమ్మ కోట ఎంపిటిసి తౌవుట్ నాయుడు, గరుగుబిల్లి సర్పంచ్, మధులత, కో ఆప్షన్ సభ్యులు షేక్ మదీనా, తదితరులు పరిశీలించారు.
ప్రభుత్వాలు మారుతున్న ఈ బ్రిడ్జ్ నిర్మాణం కలగానే మిగిలిపోతుందని ఇప్పటికైనా ఈ సమస్యను అరకులోయ పార్లమెంట్ సభ్యులు తనుజరాణి పరిష్కరించాలని కోరారు.



