ఈ నెల 9న బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో బీసీలకు 50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈనెల తొమ్మిదవ తేదీన రాష్ట్రవ్యాప్తంగా తహసిల్దారు ఆర్డిఓ మరియు కలెక్టర్ కార్యాలయాల ముందు జరిగే ధర్నాలను విజయవంతం చేయాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 9న బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జరిగే ధర్నాలు, నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయండి
బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు విజ్ఞప్తి
హైదరాబాద్ మార్చి 4 నిజం చెపుతాoన్యూస్
త్వరలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో బీసీలకు 50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈనెల తొమ్మిదవ తేదీన రాష్ట్రవ్యాప్తంగా తహసిల్దారు ఆర్డిఓ మరియు కలెక్టర్ కార్యాలయాల ముందు జరిగే ధర్నాలను విజయవంతం చేయాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు విజ్ఞప్తి చేశారు.
బుధవారం నాడు ఆయన హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో గల బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య బీసీ నేతలతో కలిసి మాట్లాడుతూ….
కామారెడ్డి బిసి డిక్లరేషన్ లో బీసీల అభివృద్ధి కొరకు ప్రతి బడ్జెట్లో 20000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారని
ఐదు సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలు బీసీల కొరకు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఉన్నందున ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లలో కేవలం 10000 కోట్లు మాత్రమే కేటాయించారని అందులో సగం కూడా ఖర్చు చేయలేదని అందువల్ల ఈ బడ్జెట్ లో నైనా 50 వేల కోట్ల రూపాయలు కేటాయించి బీసీల అభ్యర్థి కొరకు ఖర్చు పెట్టాలని ఎస్సీ సబ్ ప్లాన్ మాదిరిగానే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి బీసీల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆయన కోరారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో బీసీలకు 21 హామీలు ఇచ్చారని అందులో ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదని తక్షణమే అఖిలపక్ష బీసీ సంఘాల సమావేశం ఏర్పాటు చేసి వారు ఇచ్చిన సూచనలను పాటించి బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉండాలని ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నాయకుడు రాహుల్ గాంధీ త్వరలో పార్లమెంటులో బీసీల కొరకు ప్రైవేటు బిల్లు ప్రవేశపెడతామని హామీ ఇవ్వాడాన్ని స్వాగతిస్తున్నామని దేశంలో 56% జనాభా గలిగిన బీసీల గురించి దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో వారికి అండగా నిలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి భవిష్యత్తు ఉంటుందని అనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని ఆయన కోరారు.



