2031 వన్డే ప్రపంచ కప్‌ కు అతిథ్యమివ్వనున్న భారత్

2029 ఛాంపియన్స్ ట్రోఫీ,  2031 వన్డే ప్రపంచ కప్‌లను భారతదేశం నిర్వహిస్తుందని ఐసిసి నిర్ధారించింది.  భారత్ ఇప్పటివరకు 4 సార్లు వన్డే వరల్డ్ కప్ ఆతిథ్యం ఇచ్చింది (1987, 1996, 2011, 2023).

2029 ఛాంపియన్స్ ట్రోఫీ,  2031 వన్డే ప్రపంచ కప్‌లను భారతదేశం నిర్వహిస్తుందని ఐసిసి ప్రకటించింది. అయితే

భారత్ ఇప్పటివరకు 4 సార్లు వన్డే వరల్డ్ కప్ ఆతిథ్యం ఇచ్చింది (1987, 1996, 2011, 2023). 2031 వన్డే ప్రపంచకప్ ఇండియా అతిథ్యమిచ్చే 5 వ వన్డే వరల్డ్ కప్ అవుతుంది.

1987 లో మొదటి సారిగా భారత్ వేదికగా వరల్డ్ కప్ ను నిర్వహించారు. ఇది ఆసియాలో జరిగిన మొదటి ప్రపంచకప్. దీనికి భారత్ తో పాటు పాకిస్తాన్ కు కూడా అతిథ్యమిచ్చింది. ఈ వరల్డ్ కప్ ను అస్ట్రేలియా దక్కించుకుంది.

1996 లో రెండో సారి వరల్డ్ కప్ కు ఇండియా, పాకిస్తాన్, శ్రీలంకలు అతిథ్యమిచ్చాయి. ఈ వరల్డ్ కప్ ను శ్రీలంక దక్కించుకుంది.

2011లో మూడోసారి వన్డే వరల్డ్ కప్ కు ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్ లు అతిథ్య మిచ్చాయి. ఈ వరల్డ్ కప్ ను భారత్ దక్కించుకుంది.

2023లో నాలుగో సారి వన్డే వరల్డ్ కప్ ఇండియాలో జరిగింది. దీనికి ఇండియా మాత్రమే అతిథ్య మిచ్చింది. ఈ వరల్డ్ కప్ ను అస్ట్రేలియా దక్కించుకుంది.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button