కోదాడ చైర్మన్ ఎంపిక పై ఉత్కంఠ

కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకున్నప్పటికీ చైర్మన్ పదవికి పోటీ ఉండటంతో ఎంపిక ప్రక్రియ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతికి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు

 బరిలో ఐదుగురు ఆశావహులు…!

 కౌన్సిలర్ల అభిప్రాయాలు తెలుసుకున్న మంత్రి ఉత్తం ఎమ్మెల్యే పద్మావతి

పార్టీ సీనియర్లకా.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన వారిగా…!

 శంఖంలో నీళ్లు పోస్తే తీర్థమైనట్టుగా చివరికి వారిదే నిర్ణయం

కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకున్నప్పటికీ చైర్మన్ పదవికి పోటీ ఉండటంతో ఎంపిక ప్రక్రియ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతికి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు…

ఆశావహులందరూ పోటీలో నిలవడంతో..

నామినేషన్ వేసే క్రమంలో చైర్మన్ అభ్యర్థుల ప్రకటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.. చైర్మన్ ఆశావులందరకు కౌన్సిలర్ గా పోటీచేందుకు అవకాశం ఇవ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.. అయితే చైర్మన్ బరిలో ఉన్న ఐదుగురు కాంగ్రెస్ అభ్యర్థులు విజయ సాధించడంతో ఎవరికీ చైర్మన్ పదవి దక్కుతుందో దాని అంశంపై ఉత్కంఠ నెలకొన్నది.. ఈ ఉత్కంఠను అధిగమించి చైర్మన్ ఎంపిక చేసేందుకు అధినాయకుడు కౌంటింగ్ హాల్ నుంచి నేరుగా హైదరాబాద్ క్యాంపుకు తరలించే ఏర్పాటు చేశారు..

చైర్మన్ బరిలో ఎర్నేని కుసుమా వెంకటరత్నం బాబు, పారా సత్యవతి సీతయ్య, దేవరపల్లి మల్లీశ్వరి గుండప్పనేని పద్మావతి నాగేశ్వరరావు తోపాటు మైనారిటీ అభ్యర్థిని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుమార్తె ఎస్కే నేహా పోటీలో ఉన్నారు.. ఎవరికివారు తమకే చైర్మన్ పదవి కావాలని పట్టు పడుతుండడంతో నిర్ణయం తీసుకోవడంలో మంత్రి ఉత్తమ్ కు సవాలుగా మారింది..

ముందే చైర్మన్ ను ప్రకటిస్తే ఇబ్బంది అవుతుందని…

నామినేషన్ కు ముందే చైర్మన్ అభ్యర్థిని ప్రకటిస్తే దుష్పరిణామాలు సంభవిస్తాయనే ఆలోచనతోనే చైర్మన్ ఆశావాలను పోటీలకు దింపినట్టు తెలుస్తుంది.. క్యాంపులో శనివారం కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఎవరి అభ్యర్థిత్వం ఖరారు చేసినప్పటికీ అందరూ ఆమోదించాలని పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.

దీంతోపాటు ఒక్కొక్కరిని విడివిడిగా కలసి సీల్ కవర్లో ఎవరి పేరు ఉంటే వారిని ఆమోదించాలన్న అంశాన్ని కౌన్సిలర్లు అందరూ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది.. అధిష్టాన నిర్ణయాన్ని కట్టబడి ఉంటామని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది.. అయినప్పటికీ చైర్మన్ వైస్ చైర్మన్ ల పేర్లను ఇప్పటివరకు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తన అనుచరుల వద్ద లీక్ చేయకపోవడం గమనార్హం…

ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని చైర్మన్ పదవిని ఖరారు చేస్తారో …

ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని చైర్మన్ పదవిని ఖరారు చేస్తారు ఇప్పటివరకు అర్థం కాని పరిస్థితి నెలకొన్నదని, పార్టీలో సీనియారిటీగా.. లేక అసెంబ్లీ ఎన్నికల్లో పద్మావతి గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషిచేసిన సీనియర్ నాయకుకుడికా, చివరి నిమిషంలో పోటీ చేయించిన పార్టీ విధేయులకా, సామాజిక సమీకరణల ను పరిగణలోకి తీసుకుంటారా అనే అంశం వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలిందని చెప్పవచ్చు… ఒకరు రెండు సంవత్సరాలు మరొకరు మూడు సంవత్సరాలనే చర్చ కూడా జరుగుతుంది……

సోమవారం జరగనున్న చైర్మన్ ఎంపిక ప్రక్రియలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని విప్ జారీ చేసిన విషయం కూడా తెలిసిందే… ఇక వైస్ చైర్మన్ ఎంపికలో కూడా కొంత ఉత్కంఠ ఉందని చెప్పవచ్చు.. చైర్మన్ బలమైన సామాజిక వర్గానికి కట్టబెడితే వైస్ చైర్మన్ గిరి బలహీన వర్గాల సామాజిక వర్గానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు మంత్రి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది..

వైస్ చైర్మన్ పదవి ఎంపికపై అదే పరిస్థితి..

బలహీన వర్గాలకు చెందిన సామాజిక వర్గాలలో ఒకరిద్దరూ ఉన్నత చదువులు చదివిన మహిళలు ఉండటం కొంత కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు… ఒకవేళ సీనియర్ నాయకులకు అనివార్యమైన పరిస్థితిలో చైర్మన్ దక్కకపోతే భవిష్యత్తులో నామినేటెడ్ పోస్టులలో భర్తీ చేసి వారి అసంతృప్తిని చల్లబరిచే అవకాశ కూడా లేకపోలేదు అంటున్నారు.. ఏది ఏమైనప్పటికీ చైర్మన్ వైస్ చైర్మన్ ల ఎంపిక అంశంపై నేడు కోదాడ మున్సిపాలిటీలో నిర్వహించనున్న సమావేశ మందిరంలో తేలాల్సిందే

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button