కురవి వీర భద్రస్వామివారి ఆలయ చరిత్ర
క్రీ.శ. 850 ప్రాంతములో వేంగిరాజధానిగా చేసుకొని పాలించు చాళుక్యుల సామంతులైన రాష్ట్రకూట రాజైన భీమరాజు ఈ కురవి (కురవి అనగా గోరింటాకు లేదా ఎరుపు అని అర్ధము) నగరమును రాజధానిగా చేసికొని పాలించుచున్న కాలములో శ్రీ వీరభద్రస్వామివారి ఆలయము నిర్మించినట్లుగా చారిత్రక ప్రతీతి.

పిలిచిన పలికే దైవముగా వెలుగొందుచున్నాడు.
సకలశక్తిమూర్తి వరాల ప్రదాత శ్రీ వీరభద్రస్వామి.
మహబూబాబాద్ జిల్లా, కురవి,(నిజం చెపుతాం), ఫిబ్రవరి, 12 :
మహబూబాబాద్ జిల్లా కేంద్రమునకు 9కి.మీ. దూరమున పుర్వపు వరంగల్ జిల్లా కేంద్రమునకు 70కి.మీ. రైలు మర్గమున దూరమున మహబూబాబాద్- మరిపెడ జాతీయ రహదారి మార్గములో పెద్ద తటాకమునానుకొని కురవి మండల కేంద్రము నందు క్రీ.శ. 850 ప్రాంతములో వేంగిరాజధానిగా చేసుకొని పాలించు చాళుక్యుల సామంతులైన రాష్ట్రకూట రాజైన భీమరాజు ఈ కురవి (కురవి అనగా గోరింటాకు లేదా ఎరుపు అని అర్ధము) నగరమును రాజధానిగా చేసికొని పాలించుచున్న కాలములో శ్రీ వీరభద్రస్వామివారి ఆలయము నిర్మించినట్లుగా చారిత్రక ప్రతీతి.
తదనంతరము కాకతీయ తొలి స్వతంత్ర రాజైన ఒకటవ బేతరాజు జీర్ణోద్దరణగావించినట్లు ఆతర్వాత రెండవ బేతరాజు ఈ కురవి నగరమునకు ఆనుకొనియున్న పెద్ద తటాకమును త్రవ్వించినట్లు తెలియుచున్నది.

సకలశక్తిమూర్తి వరాల ప్రదాత అయిన శ్రీ వీరభద్రస్వామివారు పడమటముఖుడై దశహస్తుడై త్రినేత్రుడై రౌద్రపరాక్రమములతో విలసిల్లుతూ దక్షిణహస్తములలో ఒకటవ హస్తములో ఖడ్గము, రెండవ హస్తములో త్రిశూలము మూడవ హస్తములో పుష్పము. నాల్గువ హస్తములో గద మరియు ఐదవ హస్తములో దండము మరియు వామ హస్తములందు ఒకటవ హస్తములో ఢమరుకము, రెండవ హస్తములో సర్పము, మూడవ హస్తములో విల్లు. నాల్గువ హస్తములో బాణము మరియు ఐదవ హస్తములో ముద్గరము ధరించి భక్తుల పాలిటకల్పతరువుగా, పిలిచిన పలికే దైవముగా వెలుగొందుచున్నాడు.

సమస్తములైన భూత, ప్రేత, పిశాచ, గణాలు, శాకినీ, ఢాకినీ, కామినీ, వంటి ప్రమధ గణ పిశాచాలు ఈయన అధీనము. రుద్రగణాలు ఈయనను సేవిస్తాయి. భక్తులకు విపత్కర సమయంలో దిక్కుతోచని పరిస్థితిలో భక్తులను ఆదుకొనే పరమభోళామూర్తి, సమస్త క్షుద్రగణాలకు భద్రుడంటే పరమ భయం. స్వామిని తలంచిన వారికి, సేవించిన వారికి పిశాచ బాధలు సర్వదోషాలు, క్షుద్ర శక్తులు దరిజేరవు.
శ్రీ స్వామివారి కుడివైపు కొద్ది సమీపములో విజయగణపతి వెలసియున్నాడు. శ్రీ స్వామివారి పాదముల క్రింద నందీశ్వరుడు శ్రీ స్వామివారి వాహనముగా వెలసియున్నారు. శ్రీ వీరభద్రస్వామివారి ఆయుధం పేరు పట్టేశం.శ్రీ స్వామివారికి ఎడమవైపు చతుర్భుజములు కలిగి శ్రీ భద్రకాళీ అమ్మవారు వెలసియున్నారు.
శ్రీ భద్రకాళీ అమ్మవారికి కుడివైపు మొదటి హస్తమున త్రిశూలం, రెండవ హస్తములో స్వల్పసిద్ధితో హృదయాన్ని స్పందింపచేయునట్లుగా నదా అభయమిస్తూ వామహస్తములలో మొదటి హస్తములో పద్మము, రెండవ ండవ హస్తముతో భువిని శాశ్వతముగా నిలుపుమని ఆశీర్వదించినట్లు దర్శినమిచ్చుచున్నది.శ్రీ స్వామివారి మండవములో సమాంతరముగా ఇరువైపుల పరమశివుడు (లింగాకారములో) వెలసియున్నాడు.
మండపములో దక్షిణ భాగమున సప్తమాతృకలు వెలసియున్నారు.ఈ ఆలయమునకు దక్షిణ దిశలో ప్రాకారము బయట శ్రీ భద్రకాళీ అమ్మవారు స్వయంవ్యక్తమూర్తిగా వెలసి భక్తుల కోర్కెలను తీర్చి అనేక పూజలందుకొనుచున్నది.
కార్యక్రమములు 14-2-2026 నుండి ఉ|| గం|| 9-00 లకు పసుపు, కుంకుమలు.
శనివారం సా|| గం|| 7-00 లకు గణపతిపూజ, “పుణ్యాహవచనము, పంచగవ్యప్రాశన”, కంకణధారణ, దీక్షాధారణ, అంకురారోపణం, అఖండ దీపారాధన, కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం. రాత్రి గం|| 10-00లకు బసవముద్ద.మహాశివరాత్రి ఉ॥ గం|| 4-00ల నుండి శ్రీ స్వామివారి దర్శనము.ఉ॥ గం|| 4-00ల నుండి సా॥ గం|| 4-00ల వరకు శ్రీస్వామివారికి పూర్ణాభిషేకం, సా|| గం|| 4-00ల నుండి శ్రీ స్వామివారు అలంకారముతో దర్శనము, పాదభిషేకము, శివాలయము నందు ఉ॥ గం॥ 5-00ల నుండి రాత్రి గం|| 12-00ల వరకు రకు శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వరస్వామివారికి అభిషేకములు నిర్వహించబడును.’
ఆదివారం సా|| గం|| 7-00 లకు గ్రామసేవ, ఎదురుకోలు. రాత్రి గం|| 01-50 ని॥లకు (తెల్లవారితే సోమవారం),శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి కళ్యాణమహోత్సవము.16-2-2026 సోమవారం నుండి తేది 17-2-2026 మంగళవారం వరకు ప్రతి నిత్యము ఉ|| గం|| 6-00 లకు అభిషేకములు, నిత్యౌపాసన, బలిహరణ.
సా|| గం|| 6-00 లకు హోమము, సేవలు, గ్రామసేవ.18-2-20266-00 12-00 బుధవారం సా|| గం|| 6-30 లకు 2/20/2026 ఉ॥ గం॥తెప్పోత్సవము (కురవి పెద్ద చెఱువు నందు),శుక్రవారం సా|| గం||లకు అభిషేకములు, లు, నిత్యౌపాసన, బలిహరణ.
శనివారం స్వామి రథోత్సవము.21-2-2026 ఉ॥ గం॥ 6-00 లకు అభిషేకములు, నిత్యౌపాసన.ఉ॥ గం|| 10-30 ని॥లకు పూర్ణాహుతి.సా|| గం॥ 4-00 లకు బండ్లు తిరుగుట, పారువేట.రాత్రి గం|| 10-00లకు ద్వజ అవరోహణ, బసవముద్ద.22-2-2026 తెల్లవారుజామున గం॥ 500 లకు దోపోత్సవము.ఆదివారం ఉ || గం|| 6-00 ల ఉ॥ గం|| 8-00 లకు వసంతోత్సవము, ఉ॥ గం|| 11-00 లకు కురవి పెద్ద చెరువునందు త్రిశూలస్నానం. సాయంత్రం గం|| 7-00 లకు ఏకాంత సేవ, సదస్యం నాగవెల్లి,23-2-2026 సా॥ గం|| 6-30ని||లకు
శ్రీ స్వామివారి పవళింపు సేవ.నుండి మ॥ గం॥ 12-00ల వరకు అభిషేకములు.సోమవారం 27-2-2026 ఉ|| గం||11-30 లకు శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వరస్వామి వారి కళ్యాణమహోత్సవము 01-3-2026
ఉ॥ గం|॥ 6-00ల నుండి గం॥ 12-00ల వరకు పూర్ణాభిషేకములు ఉ॥ గం॥ 7-00 లకు శివాలయములో మహన్యాస పూర్వక రుద్రాభిషేకము,రుద్రహోమము.ఆదివారం శుక్రవారం పదహారు రోజుల పండుగ.మ॥ గం|| 12-00ల నుండి శ్రీస్వామివారి ఆలంకరణ.
స్వామి వారి కార్యక్రమాలు నిర్వహించబడతాయి.కావున భక్తమహాశేయులందరు శ్రీ స్వామివారి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి, శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.శ్రీ స్వామివారి సేవలో
కార్యనిర్వహణాధికారి శ్రావణపు సత్యనారాయణ,ఆలయ ఛైర్మన్ కొర్ను రవీందర్ రెడ్డి,సహాయ కమీషనర్,
ఉత్సవ కమటి ఉత్సవ కమిటి సభ్యులు :
బాలగాని శ్రీనివాస్,కుదురుపాక ఉప్పలయ్య,బందెల సంజీవ రెడ్డి,దొంగల జనార్ధన్ రెడ్డి, శ్రీమతి ధరావత్ రజిత,గడీల భిక్షపతి,చిన్నం గణేష్,ఎ ప్రొద్దుటూరి సత్యనారాయణ,భుక్యా శక్కు,గుగులోతు సోమ్లా,వెంపటి శ్రీను,తీగుళ్ళ వేంకటేష్ గౌడ్,కాసుల మల్లిఖార్జున్. అర్చకులు,ఉద్యోగులు లు పాల్గొంటారు.



