ఆన్ లైన్ లో..మున్సిపల్ ఓటర్ స్లిప్పులు
తెలంగాణ రాష్ట్రం ఎన్నికల సంఘం వెబ్ సైట్ సందర్శించి "డౌన్ లోడ్ ఓటర్ స్లిప్ బై ఎపిక్ ఐ డి అర్బన్ 2025" విండో తెరిచి జిల్లా, మునిసిపాలిటీ, వార్డు, ఎపిక్ ఐడి అనగా ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్ వివరాలు ఇవ్వగానే ఓటర్ స్లిప్ డౌన్ లోడ్ అవుతుంది. లేదా నేరుగా https://tsec.gov.in/voterSlipUlb.do అనే లింక్ తో నేరుగా వెబ్ సైట్ లో కెళ్ళి పై వివరాలతో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు) జే.అరుణ శ్రీ
రామగుండం ఫిబ్రవరి 9, (నిజం న్యూస్)
ఫిబ్రవరి 11.2026 రోజున మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో..తమ పోలింగ్ కేంద్రం చిరునామా,ఓటర్ క్రమ సంఖ్య తెలుసుకోవడానికి రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఆధ్వర్యంలో..ఓటర్ స్లిప్పులను ఇంటింటికీ పంపిణీ చేయడం జరిగింది.
ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు ఆన్ లైన్ లో కూడా ఈ ఓటర్ స్లిప్పులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
డౌన్ లోడ్ చేసుకోండిలా..
తెలంగాణ రాష్ట్రం ఎన్నికల సంఘం వెబ్ సైట్ సందర్శించి “డౌన్ లోడ్ ఓటర్ స్లిప్ బై ఎపిక్ ఐ డి అర్బన్ 2025” విండో తెరిచి జిల్లా, మునిసిపాలిటీ, వార్డు, ఎపిక్ ఐడి అనగా ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్ వివరాలు ఇవ్వగానే ఓటర్ స్లిప్ డౌన్ లోడ్ అవుతుంది.
లేదా నేరుగా https://tsec.gov.in/voterSlipUlb.do అనే లింక్ తో నేరుగా వెబ్ సైట్ లో కెళ్ళి పై వివరాలతో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
టి పోల్ ( టీ ఈ -ఫోన్)యాప్ ద్వారా.. కూడా…
ఓటర్ స్లిప్ పొందవచ్చు.ఈ స్లిప్ తో పాటు ఎన్నికల సంఘం నిర్దేశించిన ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి సులభంగా పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాము.



