అటవీ శాఖ అధికారులే కలప దొంగలుగా …?
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలోని రఘునాధపాలెం గ్రామ శివారులోని నోటిఫైడ్ ఆడవీ భూముల్లోని విలువైన సహజ సంపదను కలపగా మార్చి సంబంధిత అటవీ అధికారులే అమ్ముకుని లక్షల రూపాయలు అక్రమంగా ఆర్జిస్తున్నారు.

అధికారులే అక్రమాలకు కవచం.
అడవిని కాపాడాల్సిన వారే భక్షకులుగా మారి రోజుకు కొంత అడవిని కొట్టి అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రోజు రోజుకు అటవి కనుమరుగవుతుండగా ఆ భూమిని సేద్యానికి అప్పజెప్పి మరికొంత డబ్బులు మూటగట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వివరాల్లోనికి వెళితే
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలోని రఘునాధపాలెం గ్రామ శివారులోని నోటిఫైడ్ ఆడవీ భూముల్లోని విలువైన సహజ సంపదను కలపగా మార్చి సంబంధిత అటవీ అధికారులే అమ్ముకుని లక్షల రూపాయలు అక్రమంగా ఆర్జిస్తున్నారు.
అటవీ భూమిలోని చెట్లను తొలగించి అట్టి భూమిని సైతం ప్రైవేట్ వ్యక్తులకు చెందేలా చేసి తద్వారా మరింత సొమ్మును మూట కట్టుకుంటున్నారు.

ఐతే అడవులను కాపాడటం కోసమే ప్రభుత్వం చేత నియమించబడి ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్న సంభందిత అధికారులే ఇటువంటి దుర్మార్గపు చర్యలు చేస్తున్న నేపధ్యంలో అడవులను, అటవీ సంపదను విధిగా కాపాడాల్సిన వారే చెరబడుతున్న తీరును చూసి ఈ విషయం ఎవరికి చెప్పాలో తెలియని నిస్సహాయ పరిస్థితిలో అక్కడి ప్రజలు ఉన్నారు.

ఇదిలా ఉండగా పేర్కొన్నటువంటి అటవీప్రాంతంలో వందల సంఖ్యలో ఉన్న వన్యప్రాణులైన జింకలు, దుప్పులు, నెమళ్లు పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది.
కొంతమంది యువకులు విషయాన్ని అటవీ శాఖ ఉన్నతాధికారులకు తెలియజేయగా శుక్రవారం అటవీ ఫ్లయింగ్ స్క్వాడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసారు.



