లేవీలో పాల్గొందాం..ధాన్యం మాయం చేద్దామంటే ఇక కుదరదు
లేవీలో పాల్గొందామ్..ధాన్యం మాయం చేద్దాం.అని భావించే రైస్ మిల్లర్ ల పై క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఖాయం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు.

*నిబంధనలు పాటించని రైస్ మిల్లర్ ల పై కేసు ఖాయం*
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ
మాచన రఘునందన్..
మాడ్గుల ఫిబ్రవరి 05(నిజం చెపుతాం):
లేవీలో పాల్గొందామ్..ధాన్యం మాయం చేద్దాం.అని భావించే రైస్ మిల్లర్ ల పై క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఖాయం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు.”గురువారం ఆయన మునుగోడులో మాట్లాడుతూ కొందరు మిల్లర్ ల కు కస్టమ్ మిల్లింగ్ రైస్ చేయడం లో ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తూ..తమకు నిభందనలు పట్టవు అన్న చందాన వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.అలా “మా ఇష్టం మేం ఇలాగే ఉంటాం.ఇలాగే చేస్తాం”అనుకుని బిజినెస్ చేసే మిల్లర్ ల పై కొరడా ఝళిపించడం ఖాయం అని రఘునందన్ స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడ్డట్టు రుజువైతే రెవిన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఆస్తులు జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని రఘునందన్ వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిబంధనల్ని మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు ఆయన తెలిపారు.



