గరిడేపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా రెండోసారి ‘త్రిపురం అంజన్ రెడ్డి’ ఎన్నిక
ఐదు దశాబ్దాల ప్రజాసేవకు దక్కిన గుర్తింపు దాదాపు ఐదు దశాబ్దాలుగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అంజన్ రెడ్డి శ్రమిస్తున్నారని పార్టీ శ్రేణులు కొనియాడారు.

*ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం*
*మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి*
గరిడేపల్లి జూలై 3 (నిజం చెపుతాం)
భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అండదండలతో, ఆయన దిశా నిర్దేశంలో గరిడేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా త్రిపురం అంజన్ రెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఐదు దశాబ్దాల ప్రజాసేవకు దక్కిన గుర్తింపు దాదాపు ఐదు దశాబ్దాలుగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అంజన్ రెడ్డి శ్రమిస్తున్నారని పార్టీ శ్రేణులు కొనియాడారు.
ప్రజాసేవనే పరమావధిగా భావిస్తూ మండల ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఆయన నిస్వార్థ ప్రజాసేవను, పార్టీ పట్ల ఉన్న అంకితభావాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం… మరోసారి మండల అధ్యక్ష బాధ్యతలను అప్పగించడం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
త్రిపురం అంజన్ రెడ్డి నాయకత్వంలో గరిడేపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని పలువురు సీనియర్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
రెండోసారి మండల పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన త్రిపురం అంజన్ రెడ్డిని గరిడేపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ, పార్టీ లైన్ లో ముందుకు సాగుతున్న అంజన్ రెడ్డికి ప్రెస్ క్లబ్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సన్మాన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పెండెం సుందరయ్య (విజన్ ఆంధ్ర), గోరంట్ల శ్రీనివాస్ (సూర్య సేన), లక్కమల్ల ఉపేందర్ (మెట్రో న్యూస్), అబ్దుల్ రహమాన్ (నవ భూమి), మీడిసిన మెట్ల సతీష్ (ప్రజా దర్బార్), త్రిపురం లక్ష్మారెడ్డి (నిజం), లంకె పల్లి రమేష్ (అక్షిత) తదితర విలేకరులతో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



