అన్యాక్రాంతమైన చెరువులను కాపాడండి

ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ నాయకుల డిమాండ్

మాడ్గుల, జులై 08 (నిజం చెపుతాం): రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఆర్కపల్లి గ్రామంలోని అకన్యాక్రాంతమైన చెరువును కాపాడాలని సిపిఐ పార్టీ జిల్లా నాయకులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు.

గ్రామంలోని సర్వే నెం.285 బాపన్ కుంట 6-35 గుంటలు,సర్వే నెం.17లో 43-01 ఎకరాల చెరువుకు సంబంధించిన భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు.ఇరిగేషన్,రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వర్షాకాలంలో గ్రామ రైతులకు సాగునీరు అందించే ఈ రెండు చెరువులకు హద్దులు నిర్ణయించి,కంచె ఏర్పాటు చేయాలని కోరారు.చెరువును కాపాడకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని వారు ఆవేదన చెందారు.ఈ సమస్యపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ సిపిఐ పార్టీ నాయకులు ముకురోజు కృష్ణాచారి, మండల నాయకులు సూదిని రాంరెడ్డి, పత్యనాయక్, ఆర్కపల్లి గ్రామ నాయకులు తోలు యాదయ్య,తోలు చంద్రయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button