అందుగుల సర్పంచ్ చెక్ పవర్ తొలగింపు

మాజీ సర్పంచ్ పదవీకాలంలో గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడమే ఈ చర్యకు కారణమని జిల్లా పంచాయతీ అధికారి వెల్లడించినట్లు మండల పంచాయతీ అధికారి క్రిష్టయ్య తెలిపారు.

పెండింగ్ బిల్లుల చెల్లింపులో జాప్యం…

మండల పంచాయతి అధికారి కిష్టయ్య..

మాడ్గుల, సెప్టెంబర్ 05 (నిజం చెపుతాం): మాడ్గుల మండలంలోని అందుగుల గ్రామపంచాయతీ సర్పంచ్ పోతులపల్లి శ్రీనివాసు చెక్ పవర్‌ను జిల్లా పంచాయతీ అధికారి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మండల పంచాయతీ అధికారి కిష్టయ్య తెలిపారు.

మాజీ సర్పంచ్ పదవీకాలంలో గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడమే ఈ చర్యకు కారణమని జిల్లా పంచాయతీ అధికారి వెల్లడించినట్లు మండల పంచాయతీ అధికారి క్రిష్టయ్య తెలిపారు.

పెండింగ్ బిల్లుల అంశంపై అధికారుల పరిశీలన అనంతరం సర్పంచ్‌కు ఉన్న చెక్ పవర్‌ను తొలగిస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ అయ్యాయని ఆయన పేర్కొన్నారు.

చెక్ పవర్ తొలగించిన నేపథ్యంలో గ్రామపంచాయతీ ఆర్థిక లావాదేవీలు, చెల్లింపులు సజావుగా కొనసాగేందుకు మండల పంచాయతీ అధికారి కిష్టయ్యతో పాటు అందుగుల గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ పందుల వెంకటయ్య గౌడ్ కు జాయింట్ చెక్ పవర్ కల్పించినట్లు ఆయన తెలిపారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button