వారం రోజులు కాలేశ్వరాన్ని కేసీఆర్ కి అప్పజెప్పు. ముఖ్యమంత్రి నువ్వే. ‎

రాష్ట్రానికి సాగు త్రాగు నీరు ఎలా అందుతుందో చూడు. కేటీఆర్. ‎కాలేశ్వరం బ్యారేజ్ కు సంబంధం లేకుండా, కన్నేపల్లి నుండి నీళ్లు అందించవచ్చు. కాలేశ్వరం ప్రాజెక్టుకు పునాది కన్నెపల్లి పంప్ హౌస్ రాజకీయ కక్ష తీర్చుకోవడానికి రాలేదు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజల ముందుకు ఉంచుదామని వచ్చాం..

వారం రోజులు కాలేశ్వరాన్ని కేసీఆర్ కి అప్పజెప్పు. ముఖ్యమంత్రి నువ్వే.

‎ రాష్ట్రానికి సాగు త్రాగు నీరు ఎలా అందుతుందో చూడు. కేటీఆర్.

‎కాలేశ్వరం బ్యారేజ్ కు సంబంధం లేకుండా, కన్నేపల్లి నుండి నీళ్లు అందించవచ్చు.

కాలేశ్వరం ప్రాజెక్టుకు పునాది కన్నెపల్లి పంప్ హౌస్

రాజకీయ కక్ష తీర్చుకోవడానికి రాలేదు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజల ముందుకు ఉంచుదామని వచ్చాం..

‎ బాసర నుండి భద్రాచలం వరకు గోదావరి పారైనా ఎడారిగా మిగిలింది రాష్ట్రం.

ప్రపంచంలోనే అత్యధిక లిఫ్ట్ సామర్థ్యం ఏర్పాటు చేసి కాలేశ్వరం ఏర్పాటు.

‎మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తుమ్మిడిశెట్టిని పట్టించుకోలేదు.

సిడబ్ల్యుసి ఇంజనీర్ల సూచన మేరకు ఎంత కరువచ్చిన వీళ్లు ఉంటాయని చెప్పడంతో కాలేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ ప్రారంభం.

‎ ప్రభుత్వం మోటర్లు ఆన్ చేయకుంటే వేల సంఖ్యలో ప్రజలతో వచ్చి మేమే ఆన్ చేస్తాం, ప్రభుత్వానికి హెచ్చరించిన కేటీఆర్.

‎ భూపాలపల్లి, మహాదేవపూర్: జులై 5 (నిజం న్యూస్)


‎ రాష్ట్ర ప్రజలకు తాగునీరు సాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేతకాకుంటే వారం రోజులపాటు కాలేశ్వరాన్ని టిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అప్పజెప్పితే రాష్ట్రానికి తాగు సాగునీరు ఎలా అందించాలో చేసి చూపెడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ టి రామారావు. ఆదివారం రోజు కాలేశ్వరం ప్రాజెక్ట్ లోని ప్రధాన భాగమైనటువంటి కన్నేపల్లి పంప్ హౌస్ సందర్శన కార్యక్రమం పెద్ద మొత్తంలో తాజా మాజీ ఎమ్మెల్యేలు మంత్రులతో కలిసి పెద్ద సంఖ్యలో కందిపల్లికి చేరిన ఆయన కన్నేపల్లి వద్ద ఉన్న నీటిని వీక్షించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో కేటీ రామారావు జీడిగడ్డ ప్రాజెక్ట్ వివరాలు, జీడిగడ్డ ద్వారా తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ కి ఆనుకొని ఉన్న చివరి గ్రామం వరకు సాగునీరు తాగునీరు ఇలా అందుతుందో అన్న విషయాన్ని సూది గుచ్చినట్టు వివరించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, నీరు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణ, బాసర నుండి భద్రాచలం వరకు గోదావరి నీరు పారుతున్నప్పటికీ రాష్ట్ర పరిస్థితి ఎడారిగా మారిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 9 నెలల్లో, కాలేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ ప్రారంభానికి పక్క రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ససేమీరా అన్న కూడా, సాగునీరు లక్ష్యంగా ఏర్పడిన రాష్ట్రానికి కాలేశ్వరం ఎంతో ముఖ్యమని భావించిన కేసీఆర్, సిడబ్ల్యుసి తోపాటు ఇంజనీరింగ్ అధికారుల సూచన మేరకు, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులో నీరు లేకపోయినప్పటికీ, ఇన్చంపల్లి మేడిగడ్డ వద్ద నీరు ఎండిపోయే పరిస్థితి ఈనాడు ఉండదని సిడబ్ల్యుసి ఇంజనీరింగ్ అధికారులు వివరించడంతో కాలేశ్వరం ప్రాజెక్టులు ప్రారంభించడం జరిగిందని, కేవలం నాలుగున్నర సంవత్సరాల్లో ఒక జల యజ్ఞం గా కెసిఆర్ జీడిగడ్డ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగిందని తెలిపారు. విడిగడ్డ ప్రాజెక్ట్ గేట్లను బుట్టకుండానే, కన్నేపల్లి పంప్ హౌస్ నుండి, మహబూబాబాద్ రంగారెడ్డి రెండు జిల్లాలకు మినహా రాష్ట్రంలోని ఎనిమిది ఉమ్మడి జిల్లాలకు, సాగునీరు తోపాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు మంచినీరు అందించే స్తోమత గా నిర్మించడం జరిగిందని, కానీ ప్రభుత్వం విడిగడ్డ బ్యారేజ్ వద్ద పిల్లర్లు కుంగిపోయాయని, సొల్లు కబుర్లు చెబుతూ కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను ప్రారంభించకుండా రాష్ట్ర రైతాంగం తో పాటు ప్రజలకు తాగునీరు సాగునీరు అందించకుండా కక్ష సాధింపు చర్యలుగా, బిఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మించి ప్రజాధనాన్ని దోచుకుందని రాష్ట్ర ప్రజలకు తప్పుదారి పట్టిస్తుందని, ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కేటీ రామారావు.



‎ కాలేశ్వరం అనేది గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు ఐదారు దశాబ్దాల తర్వాత గ్రావిటీ ప్రాజెక్ట్ అయిన పోలవరానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పునాది వేశారు, కాలేశ్వరం ప్రాజెక్ట్ 20 మీటర్ల నుండి 600 మీటర్లకు నీళ్లు ఎత్తివేసే స్తోమతగా బాహుబలి మోటార్లను ఏర్పాటు చేసి, ఇక్కడ ప్రాజెక్టుకు బెస్ట్ పాయింట్ అనేది వెతికి మరి కరువులు నీళ్లు దొరికే ప్రాంతం ను వెతుకులాడి కట్టిన ప్రాజెక్టు కాలేశ్వరం వాటిలో ప్రధాన భాగం ఈరోజు నేను కూర్చుని ప్రెస్ మీట్ చేస్తున్న కన్నేపల్లి పంప్ హౌస్ అని అన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాలేశ్వరం అని అన్నారు అలాంటి ప్రాజెక్టును నాలుగున్నర ఏళ్లలో పూర్తి చేయడం జరిగిందని కాలేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక చిన్న ప్రాజెక్టు కాదని, కాలేశ్వరం అంటే మూడు బ్యారేజీలు 15 రిజర్వాయర్లు, అలాగే కాలేశ్వరం ప్రాజెక్టులో 21 పంప్ హౌస్ లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు 19 సబ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గం, 1531 కిలోమీటర్ల కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మీల్స్ , మొత్తం కలిపి 141 టీఎంసీల సామర్థ్యం స్టోరేజ్ కెపాసిటీ తో నిర్మించిన బ్యారేజీ కాలేశ్వరం అని తెలిపారు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది శెట్టి అని ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ యొక్క సామర్థ్యం 16 పీఎంసీలు మాత్రమే, దానికి 142 టిఎంసిలుగా పెంచింది టిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. ఇలా ఎన్నో అద్భుత సమహహారాలకు కేర్ ఆఫ్ కాలేశ్వరం అని గుర్తు చేశారు.

‎300 పైచిలుకు ఉన్న మూడు బ్యారేజీల పిల్లర్లలో, ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ లో రెండు పిల్లర్ల వద్ద కొంత కుంగుబాటు వచ్చింది అది కూడా, ఎన్నికల ముందు కుట్ర చేశారన్నది మా నాయకులకు అలాగే రాష్ట్ర ప్రజానీకానికి కూడా అర్థమైంది. ఇక్కడైతే రెండు పిల్లర్లు కురింగాయో ఆ పూర్తి బ్లాక్ తొలగించి మల్లా నిర్మించిన వాటికి అయ్యే ఖర్చు 400 కోట్లు, వాటిలో ప్రజల సొమ్ము ఖర్చు అయ్యేది లేదు ఎందుకంటే, ఇంటి అనే సంస్థ తిరిగి నిర్మాణం చేస్తామని ముందుకు రావడం జరిగింది, డిఫెక్ట్ లేబులిటీ లో ఉంది మొత్తం ఖర్చు మీవి భరిస్తాం, తిరిగి వాటిని నిర్మాణం చేస్తామని సంస్థ చెప్పడం కూడా జరిగింది. కానీ 32 నెలలు గడిచిన ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకుండా కేవలం, బి ఆర్ ఎస్ ప్రభుత్వంపై గురుద జల్లడమే లక్ష్యంగా కాలేశ్వరం కూలేశ్వరం అయిందని ప్రచారం చేసుకోవడం విమర్శలు చేయడం తప్ప మరి చేయలేదని అన్నారు కే టి రామారావు.

కాలేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్ప విశిష్టత ఏమిటంటే ప్రతిసారి, మేడిగడ్డ బ్యారేజ్ నుండి నీళ్లు వదలడం అవసరం లేదు, మూడు రకాల సీజన్లకు తట్టుకొని కాల పరీక్షలకు నిలబడి ప్రాజెక్టు కాలేశ్వరం గా నిర్మించడం జరిగిందని, వర్షాలు ఎక్కువగా కూర్చున్నప్పుడు ఎస్సారెస్పీ ద్వారా ప్రతి రైతు కు వారి పంటలకు నీరు అందుతుందని, అది కూడా విడ్ మానేరు ద్వారా సరఫరా కావడం జరుగుతుందని తెలిపారు. సాధారణ వర్షపాతం నమోదైతే ఎల్లంపల్లి మీదుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందుతుందని, మూడు గ్యారేజీల్లో నీళ్లు నింపుకొని ఉంటే సరిపోతుంది పంపులు చాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు కేటీఆర్, కరువైపు అసలుకు కూడా వర్షం పడని ఎడల, కరువు సంభవించిన వేళ కూడా సి డబ్ల్యూ సి లెక్కల ప్రకారం, యావత్ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు ఎక్కడ ఉంటాయి అని వెతుకుతే అది కేరాఫ్ కాలేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని, కందిపల్లి పంప్ హౌస్ వద్ద అని ఏలువెత్తి చూపెడుతూ ఇక్కడి నీళ్లు ఎల్లప్పుడూ దొరుకుతాయని అన్నారు కేటీఆర్.

‎ రైతుల అవస్థలు చూడలేక ఈరోజు జూలై 5 రైతులు నీటి సమస్యతో తెల్లదిల్లుతున్నారని కేసీఆర్ ఆదేశాలతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని, ప్రస్తుతం ఇక్కడ 98 వెల క్యూసిక్ నీరు ప్రస్తుతం కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద ఉండి, వృధాగా లక్ష చుపిక్ మీటర్ల నీరు సముద్రంలోకి వెళ్లిపోవడం జరుగుతుంది. కేవలం కన్నేపల్లి నుండి మేడిగడ్డ కు సంబంధం లేకుండా, కన్నేపల్లి పంప్ హౌస్ గేట్లు ఎత్తి మోటార్ ఆన్ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సాగు తాగునీరు అందిస్తుందని, గేట్లు ఎత్తి మోటార్లు చాలు చేయండి అని మొత్తుకున్నా కానీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు  కేటీఆర్. మేడిగడ్డ నీరు విడుదలకు సంబంధించి సాధారణ రైతులు ముఖ్యమంత్రి ప్రభుత్వానికి ప్రశ్నిస్తుంటే, సోయి లేకుండా వివరించడం దురదృష్ట కారణమని ఆవేదన వ్యక్తపరిచారు కేటీఆర్. ప్రభుత్వం తక్షణమే స్పందించి కన్నేపల్లి మోటార్లను ప్రారంభించి రైతులకు నీళ్లు అందించకపోతే, మా నాయకునితో చర్చించి వేల సంఖ్యలో కార్యకర్తలు రైతుల సమక్షంలో వచ్చి మేమే కన్నెపల్లి మోటార్లను ఆన్ చేస్తామని కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button