అవినీతి పాల్పడ్డ జెడ్పీ సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్!
పంచాయతీ కార్యదర్శుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడిన జడ్పి కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎస్ కె .మెయినోద్దీన్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

*కీలక నిర్ణయం తీసుకున్న జిల్లా కలెక్టర్ నందలాల్ పవర్*
గరిడేపల్లి జూన్ 15 (నిజం చెపుతాం)
పంచాయతీ కార్యదర్శుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడిన జడ్పి కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎస్ కె .మెయినోద్దీన్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో గరిడేపల్లి మండలంలో పని చేస్తున్న సమయంలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో రుజువు కావడంతో మెయినోద్దీన్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం రోజు ఉత్తర్వులు జారీ చేశారు.
మెయినోద్దీన్ గతంలో గరిడేపల్లి మండలంలో సీనియర్ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన తన పరిధిలోని పలువురు పంచాయతీ కార్యదర్శుల నుండి వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
కలెక్టర్ ఆదేశాల మేరకు మెయినోద్దీన్ చేసిన వసూళ్లపై ఎంక్వైరీ చేపట్టగా విచారణలో పంచాయతీ కార్యదర్శుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలతో సహా నిజాలు నిరూపితమయ్యాయి. విచారణ నివేదిక ఆధారంగా సదరు సీనియర్ అసిస్టెంట్‌పై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కఠిన చర్యలు తీసుకున్నారు.
విధుల్లో నిర్లక్ష్యం, అవినీతిని సహించేది లేదనే హెచ్చరికలతో ఆయనను సస్పెండ్ చేస్తూ సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడితే ఇలాంటి చర్యలే ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.



