మానవ తప్పిదలతోనే ప్రకృతి వైపరీత్యాలు

మానవ తప్పిదలతోనే ప్రకృతి వైపరీత్యాలు
*మేల్కొనక పోతే ముప్పే ప్రకృతిని ప్రేమిద్దాం
వనరులను సంరక్షిద్దాం
*పచ్చదనాన్ని..పర్యావరణాన్ని కాపాడుకోవాలి.
ప్లాస్టిక్ నీ నిషేదించాలి.
ఎకో ఫ్రెండ్లీ వైపు అడుగులు వేయాలి.
****. *****. *****. *****
(డాక్టర్ రజిత తుంగాని.
వ్యాస రచయిత.
*వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల.
మహాదేవపూర్ భూపాలపల్లి.)
****** ********* ********* ********
మనం నివసిస్తున్న భూమి, మన చుట్టూ ఉన్న గాలి, నీరు, చెట్లు, జంతువులు అన్నీ కలిస్తే పర్యావరణం…సకల జీవరాశి కీ, సమస్త జీవకోటి మనుగడకు అవసరమైన ప్రాణధార వనరులను మనకు పర్యావరణం అందిస్తుంది.చెట్లను కాపాడడం,ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, నీటిని సంరక్షిచడం మరియు కాలుష్యన్ని నివారించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన భూమిని అందిoచవచ్చు..ప్రకృతిని రక్షించడం అంటే మనల్ని మనం రక్షించుకోవడమే. మానవ తప్పిదాలు,నిర్లక్ష్యం కారణంగా పర్యావరణం పై ప్రభావం చూపుతోంది. పర్యావరణ వ్యతిరేక కార్యకలాపాలతో అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉండడంతో మానవ మనుగడ నేడు ప్రశ్నర్ధకంగా మారుతుంది.. ఒక వైపు ప్రపంచ దేశాలన్నీ పర్యావరణ ప్రాధాన్యాన్ని గుర్తించి దాని పరిరక్షణ కోసం కార్యాచరణ రూపొందించి జూన్ 5 వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం ను,జరుపుకుంటూన్నారు.అవగాహనా కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం చేకూరితే కొంత మేరకు అయినా పర్యావరణ న్ని సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు..ప్రతిదీ ప్రకృతి నుంచి లభిస్తున్న.. మానవ తప్పిదలు..దీనికి పెరిగే జనాభా తోడై సమస్య ఇంకా తీవ్ర రూపం దాల్చుతుంది..
అడవుల నరికివేత
ఆధునికత పెరిగిన కొద్దీ వనరుల వినియోగం, వస్తు వినియోగం పెరుగుతూ వస్తుండగా.. వివిధ ప్రాంతాలలో ఉండే వారు తమ అవసరలా కోసం చెట్లను ఇష్టనుసారoగా నరికి వేయడం తో ప్రభావం పర్యావరణo పై పడి అవంతరాలు ఏర్పడుతున్నాయి..
పెరుగుతున్న కాలుష్యం
రోజు రోజుకు వాయు కాలుష్యం పెరగడం ప్రజా ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది…దీనికి తోడు అడవులు అంతరించి పోవడం కూడా ఒక కారణం…ప్రజల ఆర్థిక, సామజిక అవసరాలు తీర్చుకోవడానికి చెట్లను నరికివేయడం, ఓజోన్ పొర దెబ్బతిని గ్లోబల్ వార్మింగ్ ఏర్పడి విపత్తులు సంభవిస్తున్నాయి..
పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు
పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనం రోజువారీ జీవితంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం..
మొక్కలు నాటడం
అడవుల విస్తీర్ణణాన్ని పెంచడానికి విరివిగా చెట్లను నాటాలి..చెట్లు గాలిని శుద్ధి చేసి సమృద్ధిగా ఆక్సిజన్ ను అందిస్తాయి.
నీటిని సంరక్షించడం:
వర్షపు నీటిని ఒడిసి పట్టడం (రేయిన్ వాటర్ హార్వెస్టింగ్ ) మరియు నీటిని వృధా చేయకుండా అవసరమైన మేరకు మాత్రమే వాడాలి..
ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి
:ప్లాస్టిక్ భూమిలో కరిగిపోదు.దీనికి బదులుగా పర్యావరణనికి హాని చేయని సంచులు కాటన్, జుట్ బ్యాగులు ఉపయోంచాలి.
పునర్వినియోగం (రిసైక్లింగ్)
:పాత వస్తువులను పారేయకుండా, మళ్ళీ ఉపయోగపడేలా రిసైక్లింగ్ చేసుకోవడం ద్వారా వ్యర్ధాలను తగ్గించవచ్చు.
విద్యుత్ అదా
అనవసర సమయం లో ఫ్యాన్ లు, ఏసీ లు, లైట్లు, తగ్గిచడం ద్వారా విద్యుత్ అదా చేయవచ్చు.దీని వల్ల విద్యుత్ ఉత్పత్తికి వాడే శిలజా ఇందనాల వాడకం తగ్గించవచ్చు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రాముఖ్యతమొట్టమొదటిసారిగా 1972లో ఐక్యరాజ్యసమితి మానవ పర్యావరణంపై స్టాక్‌హోమ్‌లో సమావేశాన్ని నిర్వహించింది. అప్పటి నుండి 1974లో మొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకవంటి కార్యక్రమాలను చేపడతారు. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన థీమ్‌తో (నినాదంతో) ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.
“ప్రకృతిని ఆరాధిస్తే అది మనల్ని కాపాడుతుంది” అనేది అక్షర సత్యం.
విజ్ఞప్తి
పర్యావరణ దినోత్సవం కేవలం ఒక రోజుకి మాత్రమే పరిమితం కాకూడదు. ప్రకృతిని ఆరాధిస్తేనే మనుగడ సాధ్యం కాబట్టి పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల భాద్యతే కాదు.. ప్రతి ఒక్కరి నైతిక భాద్యత. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నిర్మలమైన నీరు మరియు పచ్చనీ ప్రకృతిని అందిచ్చేందుకు మనమందరం ప్రతిజ్ఞ చేసి ఆచరణలో పెట్టాలి.



