మేళ్లచెరువు మరో పుష్ప

మేళ్లచెరువులో సున్నపురాయి నుండి సిమెంట్ ఉత్పత్తి వ్యాపారం ప్రారంభించి రాష్ట్రంలోనే ధనవంతుడిగా మారిన మైహోమ్ రామేశ్వరరావు కథ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే...! ప్రభుత్వ శాఖల్లో పనిచేసి రూ.కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించిన అవినీతి తిమింగలాల కథ వినే ఉంటారు... వార్తల్లో చూసే ఉంటారు...!

* రూ.150 కూలోడు,రూ.100 కోట్ల సంపాదించిన ఘనుడు.
* పొట్టకూటికోసం మైహోమ్ లో చేరి కంపెనీనే శాసిస్తున్న ఆంధ్రా నాయుడుగారు.
* కూలీ చేసిన కంపెనీకే పోటీగా పవర్ ప్లాంట్ ఏర్పాటు
* పలుచోట్ల రియల్ ఎస్టేట్,బహుళ అంతస్తుల భవనాలు
* భూకబ్జాల్లో పుష్పరాజ్…
* తగ్గేదేలే…అంటూ ఇప్పటికి కొనసాగిస్తున్న భూకబ్జాల పర్వం.

*మేళ్లచెరువు మే 28 నిజం న్యూస్:

ఎర్రచందనం చెట్లు నరికి.. కూలోడిగా పనిలో చేరి రాష్ట్రానికే సీఎంనే మార్చిన ఎర్రచందనం స్మగ్లర్ *పుష్ప* కదా అనుకుంటేరేమో… కాదప్ప.. అంతకుమించి వ్యవస్థలను శాసిస్తూ, మేళ్లచెరువులో భూదందా చేసి రూ.కోట్లు గడించిన భూకబ్జాల పుష్పరాజ్ కథ…!

మేళ్లచెరువులో సున్నపురాయి నుండి సిమెంట్ ఉత్పత్తి వ్యాపారం ప్రారంభించి రాష్ట్రంలోనే ధనవంతుడిగా మారిన మైహోమ్ రామేశ్వరరావు కథ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే…! ప్రభుత్వ శాఖల్లో పనిచేసి రూ.కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించిన అవినీతి తిమింగలాల కథ వినే ఉంటారు… వార్తల్లో చూసే ఉంటారు…!

కానీ ఓ ప్రైవేట్ కంపెనీలో నెలకు రూ.150 జీతానికి కూలోడిగా పనిచేసి 25 ఏళ్లలో రూ.కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన వాడి కథే ఇది..! నెలకు రూ.150 జీతానికి భూములు కాపరిగా పనిచేసిన వ్యక్తి నేడు అదే కంపెనీకి పోటీగా రూ.కోట్ల రూపాయలతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాడు.ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా ఉంటూ 20 ఏళ్లలో రూ.100 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టడంలో జరిగిన దందానే ఈ పుష్పరాజు కథ..! ఆ ప్రైవేట్ కంపెనీలో కూలోడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యి కూడా ఆ సంస్థను శాసిస్తున్నాడాంటే మామూలు విషయం కాదు. పదవ తరగతి కూడా పాసుకాని వ్యక్తి, ఆంధ్ర నుండి వచ్చి తెలంగాణలో.. మేళ్లచెరువు చుట్టుపక్కల గ్రామాల్లో సర్పంచులు ఎంపీపీ,జడ్పిటిసిలు, ఎవరు కావాలనేది కూడా తన కనుసైగల్లోనే శాసిస్తున్న మేళ్లచెరువు పుష్ప కథ ఇది.

*కూలోడి నుండి రూ.100కోట్ల సంపాదన*

ఆంధ్రాలోని ఓ మారూముల ప్రాంతం నుండి ఇద్దరు పిల్లలు భార్యతో బతుకుతెరువు కోసం వచ్చిన కూలోడే ఈ వార్తలోని హీరో. ఓ సిమెంట్ కంపెనీ భూముల కాపరిగా నెలకు రూ.150 కూలీకి పనిలో చేరి ఇప్పుడు మేళ్లచెరువు, హైదరాబాద్, పులిచింతల, కోదాడ, ప్రకాశం జిల్లాలో ఇతని ఆస్తులు విలువ రూ.100 కోట్లపైనే అని స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతుంది. కూలోడిగా ప్రారంభమైన మన హీరో ఆ కంపెనీని శాసించే స్థాయికి ఎదిగాడు. ఆంధ్ర నుండి తెలంగాణకు కూలోడికి వచ్చినా ప్రస్తుతం తెలంగాణలోని మేళ్లచెరువు రాజకీయాలను వెళుతున్నాడు. ఏపీలో ఓసి కులంలో పుట్టిన వ్యక్తి తెలంగాణకు వచ్చి బీసీ కులస్తుడిగా మారిపోయాడు.పేదోడిని అంటూ ప్రభుత్వం వద్ద బిసికాలనిలో 150 గజాల స్థలాన్ని పొందటం నుండి ప్రారంభమైన అతని సంపాదన ప్రస్తుతం మేళ్లచెరువులో ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసి, విక్రయించే స్థాయికి ఎదిగాడు. మేళ్లచెరువు సర్వేనెంబర్ 1057లో బినామీల పేరిట దొంగ పట్టాలు సృష్టించి 30 ఎకరాల భూమిని పనిచేసిన సంస్థకే విక్రయించి రూ.కోట్లు కూడా పెట్టాడు. పట్వారి ఇంట్లో అద్దెకు ఉండి మేళ్లచెరువు భూముల లెక్కలు పసికట్టాడు. ఇంకేముంది ప్రభుత్వ, భూస్వాముల భూములకు పట్టాలు సృష్టించి విక్రయించాడు.ప్రభుత్వ భూములను బినామీల పేరిట పట్టాలు సృష్టించి విక్రయాలు జరిపాడు. మేళ్లచెరువులో అత్యంత ఖరీదైన సర్వే నెంబర్ 874లో ఇప్పటికే 5ఎకరాలు జీవో నం:59ద్వారా రెగ్యులరైజ్ చేసుకున్నాడు.18 ఎకరాలు చదును చేసి జీవో నం.59 ద్వారా రెగ్యులరైజ్ చేసుకోవాలనుకున్న అతను కబ్జాకు స్థానికులు అడ్డం పడ్డారు. చివరి నిమిషంలో అతను కబ్జా చేసి 18ఎకరాల్లో చదును చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసింది. అయినా 874లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు తన పంథా ను కొనసాగిస్తూనే ఉన్నాడు.దొరికిన కాడికి భూములను చరపట్టి అమ్మకాలు జరిపి రూ.కోట్లు గడించాడు.

*కూలి పని చేసిన కంపెనీకే పోటీగా పవర్ ప్లాంట్ నిర్మాణం*

మేళ్లచెరువు,మఠంపల్లి శివారులో మైహోమ్ సిమెంట్ సంస్థ సుమారు 150 ఎకరాల్లో 30 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. మెగావాట్ విద్యుత్ సామర్థ్యం కోసం సుమారు ఐదు కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అయితే అదే కంపెనీలో పనిచేసే రూ.కోట్లు సంపాదించిన మన కథలోని హీరో… ఆ కంపెనీలోని కులోడు.. ప్రస్తుతం తన పనిచేసిన కంపెనీకి పోటీగా పవర్ ప్లాంట్ ను నిర్మిస్తున్నాడు. మఠంపల్లి మండలంలో సుమారు రూ.30 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ సంస్థను ఏర్పాటు చేస్తున్నాడు ఇందుకుగాను మఠంపల్లి మండల రైతుల వద్ద 30 ఎకరాల భూమిని ఎకరం రూ.30లక్షలు చొప్పున కొనుగోలు చేశాడు. భూమి కొనుగోలుకే రూ.9 కోట్లు వెచ్చించి మరో రూ.20కోట్లతో భారీ ఎత్తున పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నారు.మైహోమ్ సిమెంట్ సంస్థ తర్వాత ఈ ఏరియాలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడుతుంది… గతంలో మైహోమ్ లో పనిచేసిన కూలోడేనని… మైహోమ్ సంస్థకు పోటీగా సోలార్ పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నట్లు మఠంపల్లిలో మండలంలో జోరుగా ప్రచారం సాగుతుంది.ఆ కంపెనీలో పనిచేసిన వ్యక్తి ఈ స్థాయిలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎంత జీతం వస్తే ఇన్ని డబ్బులు సంపాదించి ఉంటాడని ఆ సంపాదన వెనుక ఉన్న రహస్యం చెప్పాలని ఈ ప్రాంతం వారంతా ఈ పవర్ ప్లాంట్ ను చూసేందుకు ఎగబడుతున్నారు. ఇన్ని రూ.కోట్ల ఆస్తి ఉన్న పౌరసరఫరాల శాఖ మంత్రి ఈ పుష్పకు రేషన్ కార్డు ఇచ్చి పేదోడిగా గుర్తింపు ఇచ్చారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి దొంగ పట్టాలు సృష్టించి విక్రయాలు జరుపుతున్న ఇప్పటికీ రెవిన్యూ అధికారులు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు.ఇది మేళ్లచెరువు పుష్ప కథ.భూకబ్జాల్లో తగ్గేదేలే అంటూ ఈ ఏరియాను శాసిస్తున్నాడు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button