అంత్యపుష్కరాల్లో వడదెబ్బతో భక్తుడు మృతి.
పుష్కరాల్లో విషాదం.

అంత్యపుష్కరాల్లో వడదెబ్బతో భక్తుడు మృతి.
పుష్కరాల్లో విషాదం,
మహాదేవపూర్ భూపాలపల్లి, మే 23( నిజం న్యూస్)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రిలింగ క్షేత్రం వద్ద గత రెండు రోజులుగా కొనసాగుతున్న సరస్వతి అంతే పుష్కరాల్లో, మూడవరోజు శనివారం రోజు ఓ భక్తుడు వడదెబ్బకు గురై మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. కాలేశ్వరం లోని ఇప్పల బోరు ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అపాస్మరక పరిస్థితిలో పడి ఉండడంతో స్థానికులు గుర్తించి 108 వాహనానికి సమాచారం అందించడంతో, వైద్య సిబ్బంది మరియు పోలీసులు సంఘటన స్థలానికి చేరి అపాస్మకార పరిస్థితిలో ఉన్న వ్యక్తిని ఆసుపత్రి క్యాంపుకు తరలించగా పరీక్షించిన వైద్యులు వడదెబ్బతో మృతి చెందడం జరిగిందని వైద్యులు నిర్ధారించారు మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.



