పుష్కర ప్రారంభంతో పవిత్ర జలంగా మారిన అంతర్వాహిని.
వైభవంగా పుష్కర ప్రారంభ కార్యక్రమం. త్రివేణి సంగమం వద్ద పుష్కర ప్రారంభంతో అరుదైన ఘట్టానికి వేదికగా మారిన వేళ. పుష్కర పవిత్ర స్నానాన్ని ప్రారంభించిన పీఠాధిపతి శంకర విజయేంద్ర. మొదటి,5:43 నిమిషాలకు ప్రారంభమైన పుష్కరాలు.

పుష్కర ప్రారంభంతో పవిత్ర జలంగా మారిన అంతర్వాహిని.
వైభవంగా పుష్కర ప్రారంభ కార్యక్రమం.
త్రివేణి సంగమం వద్ద పుష్కర ప్రారంభంతో అరుదైన ఘట్టానికి వేదికగా మారిన వేళ.
పుష్కర పవిత్ర స్నానాన్ని ప్రారంభించిన పీఠాధిపతి శంకర విజయేంద్ర.
మొదటి,5:43 నిమిషాలకు ప్రారంభమైన పుష్కరాలు.
సంగమ ఘాట్ వద్ద శాస్త్రోకంగా పుష్కర ప్రత్యేక పూజలు.
మంత్రులు ఎమ్మెల్యేల సమక్షంలో పుష్కర వేడుకలు.
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా, సదుపాయాల ఏర్పాట్లు, భద్రత దృష్ట్యా భారీ బందోబస్తు.
12 రోజుల పుష్కరాల్లో వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా అధికార యంత్రాంగం.
పుష్కర పుణ్య స్నానాన్ని ఆచరించిన గవర్నర్.
మహాదేవపూర్, భూపాలపల్లి మే 21 (నిజం న్యూస్)
దక్షిణ కాశీగా పేరుగాంచిన త్రిలింగ క్షేత్రమైన కాలేశ్వరం మూడు నదుల సంగమం వద్ద, అంతర్వాహినిగా కొనసాగే సరస్వతి నది అంత్య పుష్కరాల పర్వదినం సందర్భంగా గురువారం ఉదయం,5.45 పుష్కర ఘడియలు ప్రారంభం కావడంతో పవిత్ర జలంగా మారింది సరస్వతి అంతర్వాహిని తోపాటు త్రిలింగ క్షేత్రం. కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర స్వామి ఆధ్వర్యంలో ప్రారంభమైన సరస్వతి అంత్య పుష్కరాలు, తొలి పుష్కర స్నానం ఆచరించడంతో, పుష్కర పవిత్ర ఘడియ ప్రారంభం కావడం జరిగింది. త్రివేణి సంగమం వద్ద పీఠాధిపతి పుష్కర స్నానం ఆచరించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిరోజు పుష్కర ప్రారంభానికి ఒకరోజు ముందే భక్తులు కాళేశ్వరానికి చేరి, గురువారం తెల్లవారుజామున ప్రారంభమైనటువంటి పుష్కరాల్లో పెద్ద సంఖ్యలో పవిత్ర పుష్కర స్నానాన్ని ఆచరించారు భక్తులు.
త్రివేణి సంగమం వద్ద పుష్కర ప్రారంభంతో అరుదైన ఘట్టానికి వేదికగా మారిన వేళ.
దక్షిణ కాశిగా పేరుగాంచిన కాలేశ్వరంలో గురువారం ఏక జామున కంచి పీఠాధిపతి పర్యవేక్షణలో సరస్వతి అంత్య పుష్కరాల ప్రారంభం, గోదావరి తో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక సదుపాయాలు ఆధ్యాత్మిక, కేంద్రాలు పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేక సరస్వతీ విగ్రహం, ఈ గజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు అలాగే పుష్కర ప్రారంభానికి వచ్చిన పీఠాధిపతులు వేద పండితులతో దక్షిణ కాశీ కాలేశ్వరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
పుష్కర పవిత్ర స్నానాన్ని ప్రారంభించిన పీఠాధిపతి శంకర విజయేంద్ర.
సరస్వతి అంత్య పుష్కరాల ప్రారంభం త్రివేణి సంగమం వద్ద విఐపి ఘాట్ తో పాటు సరస్వతి ఘాట్ వద్ద కంచి కామూటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పుష్కర స్నానం ఆచరించి గోదావరి లో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆధ్వర్యంలో కాలేశ్వర ముక్తేశ్వర స్వామి తో పాటు శుభానంద్ దేవి సరస్వతి మాత ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించడంతో, దక్షిణ కాశి కాళేశ్వరంలో పుష్కర ఘడియలు ప్రారంభమయ్యాయి.
మంత్రులు ఎమ్మెల్యేల సమక్షంలో పుష్కర వేడుకలు.
సరస్వతి అంతే పుష్కరాల ప్రారంభానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ మంత్రి కుండ సురేఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర సత్యనారాయణ రావు, తుపార్టు పలువురు పుష్కర ప్రారంభ కార్యక్రమంలో హాజరయ్యారు, అనంతరం పుష్కర స్నానాన్ని ఆచరించి విశ్వేశ్వరునికి తొలి పూజ కార్యక్రమాలను నిర్వహించారు.
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా, సదుపాయాల ఏర్పాట్లు, భద్రత దృష్ట్యా భారీ బందోబస్తు.
గురువారం నాటి నుండి పుష్కరాలు ప్రారంభమై జూన్ ఒకటవ తేదీ నాటికి 12 రోజులపాటు కొనసాగునున్న సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యవేక్షణ తో పాటు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పి సంకీర్త పర్యవేక్షణలో, భక్తులకు అన్ని వసతుల ఏర్పాటుకై అనుక్షణం పర్యవేక్షిస్తూ, రాబోయే రోజుల్లో భక్తులు మరింత పెరిగే, అంచనాను గమనించిన అధికార యంత్రాంగం, పారిశుద్ధ్యం, వైద్యం, మంచినీరు, సలవ పందిర్లతో పాటు, మహిళా భక్తులకు దుస్తులు మార్చుకొనుటకు, ప్రత్యేక రూములు, భద్రత పరిమాణాల దృశ్య 2500 మంది పోలీస్ బలగాలు ఏర్పాటుచేసి, వాటి ఇష్టమైన నిఘా, రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల రాకపోకలు వాహనాల సదుపాయం కొరకు ప్రత్యేక, పార్కింగ్ స్థలాలు, ఆర్టీసీ ప్రత్యేక ప్రయాణ కేంద్రం, పార్కింగ్ స్థలాలతో పాటు ఆర్టీసీ కేంద్రం నుండి పుష్కర ఘాట్ల వరకు, మినీ వాహనాల సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు అధికారం. ఎట్టి పరిస్థితుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఆయా శాఖల అధికారులు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలు పర్యవేక్షిస్తూ పుష్కరాలు విజయవంతం కొరకు ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు అధికారులు.
పుష్కర పుణ్య స్నానాన్ని ఆచరించిన గవర్నర్.
కాలేశ్వరంలో నిర్వహించబడి సరస్వతి అంత్య పుష్కరాలకు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు కాలేశ్వరం చేరారు. వారికి రాష్ట్రమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆహ్వానం పలికి సన్మానించడం జరిగింది. గవర్నర్ శుక్ల కుటుంబ సభ్యులతో విఐపి ఘాట్ వద్ద పుష్కర పుణ్య స్నానాన్ని ఆచరించారు. అనంతరం ముక్తేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు గవర్నర్.


