అధికారుల కనుసైగల్లో ఇది కాంట్రాక్టర్ అరాచకం కాదా.
ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అరాచకానికి నాలుగు మండలాల రైతులు బలి. లారీలు లేకుంటే కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు. మంత్రి సొంత ఊరు ధన్వాడ రైతులను సైతం వదలని కాంట్రాక్టర్. అధికారులు పుష్కరాల్లో బిజీ, ధాన్యం రవాణా సంగతి అంతే. ముఖ్యమంత్రి ఆదేశాలు లెక్కచేయని అధికారులు కాంట్రాక్టర్. మంత్రి స్పందించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి,రైతులు.

అధికారుల కనుసైగల్లో ఇది కాంట్రాక్టర్ అరాచకం కాదా.
ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అరాచకానికి నాలుగు మండలాల రైతులు బలి.
లారీలు లేకుంటే కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు.
మంత్రి సొంత ఊరు ధన్వాడ రైతులను సైతం వదలని కాంట్రాక్టర్.
అధికారులు పుష్కరాల్లో బిజీ, ధాన్యం రవాణా సంగతి అంతే.
ముఖ్యమంత్రి ఆదేశాలు లెక్కచేయని అధికారులు కాంట్రాక్టర్.
మంత్రి స్పందించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి,రైతులు.
మహాదేవపూర్, భూపాలపల్లి: మే 20( నిజం న్యూస్)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని, కాటారం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న నాలుగు మండలాల్లో, ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి, రైస్ మిల్లులకు ధాన్యం రవాణా చేయకుండా, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వందల మంది రైతుల, జీవితాలతో చెలగాటమాడడం, రైతులు ముత్తుకుంటూ, తమ ధాన్యం రైస్ మిల్లులకు తరలించండి అంటూ ధర్నాలు చేపడుతున్న, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ తో కుమ్మక్కైన అధికారులు సైతం, నోరు మెదపకుండా కాంట్రాక్టర్ పై లారీల ఏర్పాటుకు చర్యలు తీసుకోకుండా, అంతా సజావుగా సాగుతుందని చెప్పుకోవడం, రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు వ్యవసాయ శాఖ మంత్రి, వరి ధాన్యం కొనుగోలు రవాణాపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని, ధాన్యం రవాణా విషయంలో జాప్యం జిల్లా కలెక్టర్ ది పూర్తి బాధ్యత వహించాలని, టెలి కాన్ఫరెన్స్ ద్వారా మూడు గంటల పాటు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఆదేశించడం జరిగింది కానీ, అధికారులు కాంట్రాక్టర్ తో కుమ్మక్కు అయి, గత 30 రోజుల నుండి నామమాత్రంగా తనిఖీల పేరుతో కాలయాపన చేయడం, మహాదేవపూర్ తో పాటు సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో 70 శాతం వరకు వరి, రవాణా కాకపోవడం అధికారులు సైతం ముఖ్యమంత్రి ఆదేశాలను లెక్క చేయడం లేదని, రైతుల ఆందోళనలలు ధర్నాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. భూతల్లిని నమ్ముకొని ఆరుకాలం పండించిన రైతన్నల పంటలకు, సమయానికి ధాన్యాన్ని తరలించకుండా కాంట్రాక్టర్ అరాచకం పై ప్రశ్నించే నాధుడు కరువయ్యాడని నేటి సబ్ డివిజన్ లో ధాన్యం రవాణా చేయకుండా ఉన్న పరిస్థితి సాక్ష్యం.
కాంట్రాక్టర్ అరాచకానికి నాలుగు మండలాల రైతులు బలి.
వడ్ల కొనుగోలు కేంద్రాల నుండి రైసు మిల్లుల వరకు ధాన్యాన్ని రవాణా చేస్తానని కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్, తమ స్వార్థం కోసం, తక్కువ లారీలు చార్జి కొరకు, ఏర్పాటు చేసి ధాన్యాన్ని తరలించే ప్రక్రియలు, లారీలు ససే మీనా అనడం, సబ్ డివిజన్ పరిధిలోని కొనుగోలు కేంద్రాల వద్ద, 70 శాతం ధాన్యం రైస్ మిల్లులకు తరలించకుండా విలువ ఉంది. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ కమిషన్కు కక్కుర్తి పడి, సమయానికి లారీలు అందుబాటులో ఉంచి ధాన్యాన్ని రవాణా చేయకుండా, ఇష్టమున్న రైతులు సొంత డబ్బుతో, లారీలు తరలించుకొనుటకు, ఒత్తిళ్లు చేస్తూ, పలు అధికారులతో ప్రైవేట్ లారీలను, ధాన్యం రవాణాకు ఒత్తిళ్లు చేయడం, కాంట్రాక్టర్ సాధ్యం కానీ వ్యవహారాన్ని కొనసాగిస్తూ రైతులపై అరాచకాన్ని సృష్టిస్తూ, సమయానికి ధాన్యం రైస్ మిల్లులకు చేరకుండా, రైతులకు నష్టం వాటిల్లేలా చేస్తున్న కాంట్రాక్టర్ పై అధికారులు, ఇప్పటికీ కనీస చర్యలు తీసుకోకపోవడం, కాంట్రాక్టర్ వద్ద లారీలేనప్పుడు, బూచిగా లారీలు చూపెట్టి ప్రతి ఏటా కాంట్రాక్ట్ దక్కించుకుంటున్న ఈ కాంట్రాక్టర్ కు అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారని స్పష్టంగా కనబడుతుంది.
మంత్రి సొంత ఊరు ధన్వాడ రైతులను సైతం వదలని కాంట్రాక్టర్.
ధాన్యం రవాణాలు జాప్యం చేయకూడదని ముఖ్యమంత్రి కఠిన ఆదేశాలు ఉన్నప్పటికీ, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ మాత్రం మంత్రి సొంత ఊరి రైతులను కూడా వదలలేదు. కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ధన్వాడ మంత్రి స్వగ్రామం అయినప్పటికీ, అక్కడి కొనుగోలు కేంద్రాల్లో కూడా గత 25 రోజులుగా, ధాన్యాన్ని కాంట్రాక్టర్ రవాణా చేయకపోవడం. ఆశ్చర్యానికి దారితీసింది. తాజాగా బుధవారం రోజు ధన్వాడ గ్రామ రైతులు, వడ్ల సంచులతో ప్రధాన రహదారిపై ధర్నాకు దిగడం చర్చనీయంగా మారింది. ధాన్యం రవాణా చేయకుండా మంత్రి సొంత ఊరి రైతులను కూడా లెక్క చేయలేదంటే, కాంట్రాక్టర్కు అధికారులు ఎంత తొత్తుగా మారారు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు సబ్ డివిజన్ పరిధిలో ధాన్యం రవాణా, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అరాచకం ఒకవైపు రైతుల జీవితాలతో చలగాటమాడుతున్న క్రమంలో, గురువారం నుండి సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కావడం, ఇక అధికారులంతా పుష్కరాల్లో బిజీ బిజీగా ఉండడం, సబ్ డివిజన్ పరిధిలోని, ధాన్యం రవాణా విషయం ఇక అధికారులు మరిచిపోయినట్టే, ఇక కాంట్రాక్టర్ కు అడిగే నాధుడు ఉండడు అంతా ఇష్టారాజ్యంగా కొనసాగుతుంది. తమ ధాన్యం రైస్ మిల్లులకు పోవాలనుకున్న రైతులు, సొంత ఖర్చుతో లారీలను ఏర్పాటు చేసుకొని ధాన్యాన్ని తరలించడమే తప్ప వేరే మార్గం ఉండదు. ఇక పుష్కరాల ప్రారంభంతో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ కు అధికారుల నుండి అంతర్గతంగా విముక్తి కలిగినట్టే, ఏదైనా ప్రశ్నిస్తే మేము పుష్కర పనుల్లో బిజీగా ఉన్నామని, ఒక వంక అధికారులకు బలంగా దొరికినట్లే. దీంతో రైతులు మరియు ధాన్యం సంగతి అంతే.
ముఖ్యమంత్రి ఆదేశాలు లెక్కచేయని అధికారులు కాంట్రాక్టర్.
వరి ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ఎలాంటి జాప్యం వహించకూడదని రైస్ మిల్లుల వద్ద కోత, కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం రవాణాపై, అలసత్యం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని, జిల్లాలో ధాన్యం కొనుగోలు రవాణా వ్యవహారం జిల్లా కలెక్టర్ ది పూర్తి బాధ్యతగా ఆదేశిస్తూ ఈనెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు వ్యవసాయ మంత్రి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించడం జరిగింది. కానీ సబ్ డివిజన్ పరిధిలోని మహాదేవపూర్ కాటారం, మహాముత్తారం, మల్హర్ రావు మండలాల్లో మాత్రం, కొనుగోలు కేంద్రాల వద్ద కేవలం 25 నుండి 35% వరకు ధాన్యం రవాణా, మిగిలిన 65 నుండి 70 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రవాణాకు సిద్ధంగా ఉంది. కానీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ మాత్రం కమిషన్ కు కక్కుర్తి పడి, టెండర్లు చూపెట్టిన లారీలకు బదులు, తక్కువ ధరకు లారీలను ఏర్పాటు చేసే క్రమంలో విఫలం కావడంతో, సబ్ డివిజన్ పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సరఫరా కాకుండా అలాగే మిగిలిపోయింది. అధికారులు పర్యవేక్షించి, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని తక్షణమే లారీలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, అధికారులు కాంట్రాక్టర్ కు వత్తాసు పలుకుతూ, అడ్డదారిలో లారీల రవాణా కొరకు ప్రయత్నం చేయడంతో అది విఫలం కావడం, కాంట్రాక్టర్ మరియు అధికారులు కుమ్మక్కైనట్లు తెరపైకి రావడం జరిగింది. మరోవైపు రాష్ట్ర మంత్రి స్వగ్రామమైన ధన్వాడలో సైతం కాంట్రాక్టర్ తన ప్రతాపాన్ని చూపి, ధాన్యాన్ని రవాణా చేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు, రోడ్డుపై వడ్ల బస్తాలతో ధర్నాకు దిగడం, ఇప్పుడు చర్చనీయంగా మారడం జరిగింది. ఈ వ్యవహారాలన్నీ చూస్తే ముఖ్యమంత్రి ఆదేశించిన అధికారులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారని, అది కూడా మంత్రి ఊరి నుండి ధాన్యం రవాణా చేయకుండా ఉండడం అంటే అధికారుల అండ కాంట్రాక్టర్ కు ఎంత ఉందో అనేది, అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాల కన్నా, కాంట్రాక్టర్ హుకుం ను అమలు చేస్తున్నారని చెప్పడానికి సబ్ డివిజన్ పరిధిలో ని కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యమే సాక్ష్యం. ఇప్పటికైనా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తక్షణమే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని, వేరే కాంట్రాక్టర్ ను ఏర్పాటు చేయడం లేదా కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు, పాస్పోర్ట్ బాధ్యత అప్పగించి, సాధ్యమైనంత త్వరగా ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాల్సిన అవసరం ఉంది.



