అంత్య పుష్కరాల విధులకు గైర్హాజరు అయితే మేము జారీ. జిల్లా కలెక్టర్.

పుష్కరాల పనుల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్పీలు.

అంత్య పుష్కరాల విధులకు గైర్హాజరు అయితే మేము జారీ. జిల్లా కలెక్టర్.

పుష్కరాల పనుల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్పీలు.

మహాదేవపూర్ భూపాలపల్లి మే 18 నిజం న్యూస్

సరస్వతి అంత్య పుష్కరాలకు కేటాయించిన అధికారులు మరియు సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే మేమో జారీ చేయక తప్పదని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఐ డి ఓ సి కార్యాలయంలో పుష్కరాల విధుల కేటాయించిన అధికారులు మరియు సిబ్బంది తో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు కలెక్టర్. 12 రోజులపాటు నిర్వహించబడే పుష్కరాల్లో అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సరస్వతి పుష్కరాలు ఏలా విజయవంతం చేయడానికి అధికారులు సిబ్బంది కృషి చేశారు అలాగే అంత్య పుష్కరాల విజయానికి కూడా అలాగే పని చేయాలని అన్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పుష్కరాలకు కేటాయించిన అధికారులు సిబ్బంది ముందస్తుగా ఆయా శాఖలకు సంబంధించి పనులను పరిశీలించాలని ఉన్నారు. 21వ తేదీ ఐదు 30 నిమిషాలకు పుష్కరం ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. పీఠాధిపతులు అలాగే మంత్రులు మరియు ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. వాకి టాకీ సహాయంతో సమస్యలను తక్షణమే పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా వైద్యులు అందుబాటులో ఉండాలని 12 రోజులపాటు ఇలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలని దర్శనం వద్ద క్యూ లైన్ భక్తులు గోదావరిలో వెళ్లకుండా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గజ ఈతగాళ్లు నాటు పడవల ద్వారా నిఘా పెట్టాలని, అలాగే తాత్కాలిక బస్టాండ్ నుండి పుష్కర ఘాట్ వరకు భక్తుల సౌకర్యార్థం ఉచిత షటిల్ బస్సులు నడిపించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

పుష్కరాల పనుల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్పీలు.

కాలేశ్వరం వద్ద నిర్వహించబడే అంత్య పుష్కరాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అలాగే సుప్రీంట్ ఆఫ్ పోలీస్ సంకీర్త్ తో కలిసి పనులను పరిశీలించడం జరిగింది. ప్రధాన పుష్కర ఘాట్ వద్ద భక్తుల సౌకర్యార్థం నదిలో వైర్ మ్యాట్ ఏర్పాటు చేయాలని అన్నారు కలెక్టర్. అలాగే పారిశుద్ధ్యం పనులు భక్తులకు సమాచారం తెలుసుకునే తగిన సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. జారికేట్లు వద్ద కలెక్టర్ మరియు ఎస్పీలు పరిశీలించి ప్రధాన ఘాట్ నుండి సరస్వతి ఘాట్ వరకు ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారిపై నిరంతరం మంచినీరు చల్లుతూ ఉండాలని అన్నారు. స్పాట్ స్టాల్ టెన్త్ సిటీ మ్యూజియం పనులను కలెక్టర్ మరియు ఎస్పీ పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా జాప్యం లేకుండా పుష్కర ప్రారంభ రోజుకు ఒక్కరోజు ముందు అన్ని పనులు పూర్తి కావాలని ఆదేశించారు కలెక్టర్.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button