రవాణా కాంట్రాక్ట్ ఇచ్చారు కదా, ఇసుక లారీలు ఎందుకు.
10 లారీలు ఉన్న కాంట్రాక్టర్ నాలుగు మండల్లో రవాణా ఎలా సాధ్యం.

రవాణా కాంట్రాక్ట్ ఇచ్చారు కదా, ఇసుక లారీలు ఎందుకు.
10 లారీలు ఉన్న కాంట్రాక్టర్ నాలుగు మండల్లో రవాణా ఎలా సాధ్యం.
మండలంలో రవాణాకు నోచుకోని 50 శాతం ధాన్యం.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో, బస్తాకు 20, ఇచ్చి రవాణా చేసుకుంటున్న రైతులు.
మండలంలో అనేక కొనుగోలు కేంద్రాల వద్ద బార్దారుల కొరత.
బార్ధాన్లు ధాన్యం రవాణా లేక ఆందోళనలో రైతులు.
అధికారులు కాంట్రాక్టర్ చేతివాటకంతో, రైతులకు తప్పని నష్టం.
మహాదేవపూర్ భూపాలపల్లి మే 18 (నిజం న్యూస్)
మహాదేవపూర్ మండలంలో ధాన్యం కొనుగోలు వ్యవహారం రోజుకు ఒక మలుపు తిరుగుతుంది, ఇప్పటికీ కొనుగోలు చేసిన ధాన్యం మిల్లర్లకు రవాణా చేయకపోవడం, బార్ధాన్ సరఫరా పూర్తిస్థాయిగా అందకపోవడం, చివరికి రైతులే రైసు మిల్లుల వరకు సొంత ఖర్చుతో రవాణా చేసుకునే దుస్థితికి దారి తీసింది ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాల వ్యవహారం. తాజాగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైసు మిల్లులకు రవాణా కొరకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ, రవాణా చేయకపోవడంతో, చివరికి ఇసుక రవాణా కొరకు వచ్చిన లారీలను, కొనుగోలు కేంద్రాలకు తరలించడం జరుగుతుంది. అంటే అధికారులు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాల్సింది పోయి, హైదరాబాద్ నుండి వచ్చే ఇసుక లారీలకు, భయభ్రాంతులకు గురిచేసి వరి కొనుగోలు కేంద్రాలకు పంపించి అక్కడి నుండి రైస్ మిల్లర్లకు ధాన్యం రవాణా కొరకు తరలించడం జరుగుతున్న క్రమంలో, కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లర్ల వరకు ధాన్యాన్ని రవాణా కొరకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ మరి ఎందుకు నియమించినట్లు అనేది ప్రశ్నార్థకంగా మారింది.
10 లారీలు ఉన్న కాంట్రాక్టర్ నాలుగు మండల్లో రవాణా ఎలా సాధ్యం.
ఇక ప్రస్తుతం మహదేవపూర్ మండలం తో పాటు చుట్టుపక్కల మరో మూడు మండలాలకు వరి కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లర్ల వరకు రవాణా కొరకు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్, వద్ద వాహనాల సదుపాయం ఎంతవరకు ఉంది, అని అధికారులు తెలుసుకున్నారా, లేక అలాగే గుడ్డిగా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అనటానికి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ వద్ద కేవలం 10 లారీలు మాత్రమే ఉన్నాయని, సుమారు నాలుగు మండలాల్లో వడ్ల రవాణా తోపాటు, మొక్కజొన్న రవాణాకు కూడా అదే కాంట్రాక్టర్ కు అప్పగించడం జరిగిందని, గత కొన్ని సంవత్సరాలుగా అదే కాంట్రాక్టర్ను ప్రతి సంవత్సరం అధికారులు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ఇవ్వడం జరుగుతుందని, అలాగే ప్రతి వేసవి సీజన్ వరి కొనుగోలు కేంద్రాల వద్ద, రవాణా సౌకర్యం సమయానికి ధాన్యం సరఫరా కాకపోవడం, కాంట్రాక్టర్ లారీలకు పంపకుండా, ప్రైవేట్ వ్యక్తులకు బస్తాకు 10 రూపాయల నుండి 20 రూపాయల వరకు అదనంగా చెల్లించుటకు ప్రోత్సహించడం లాంటివి, ఆనవాయితీగా కొనసాగడం ఆశ్చర్యం. ఇదే క్రమంలో అధికారులు కూడా కాంట్రాక్టర్కు ప్రశ్నించి వాహనాలు సమకూర్చి రవాణా చేయాలని ఆదేశించి లేదంటే చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, హడావుడిగా అధికారులు వచ్చి ఇసుక లారీలను రవాణా ధాన్యం రవాణా కొరకు పంపడం వెనుక మతలబు ఏమిటి. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ వద్ద వాహనాలు లేకుంటే మరో కాంట్రాక్టర్కు అప్పగించాలి కానీ సంవత్సరాల తరబడి అదే కాంట్రాక్టర్కు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఇవ్వడం ఇది అధికారులకే తెలుసు కానీ ప్రజలకు మాత్రం అర్థం అయిపోయింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇప్పటికీ మండలంలో సుమారు 50 శాతం వరి రవాణాకు నోచుకోకుండా కొనుగోలు కేంద్రాల వద్ద పెట్టుకుని రైతులు పడిగాపులు కాస్తున్నారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో, బస్తాకు 20, ఇచ్చి రవాణా చేసుకుంటున్న రైతులు.
ప్రస్తుతం మండలంలో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ సమయానికి వాహనాలు సమకూర్చకుండా నిర్లక్ష్యం చేయడంతో, రైతులు తమ సొంత ఖర్చుతో బస్తాకు 20 రూపాయలు వెచ్చించి ప్రైవేట్ డీసీఎం లేదా ఇతర, చిన్న వాహనాల్లో 200 బస్తాలను ట్రాన్స్పోర్ట్ చేసే వెసులుబాటు ఉన్న వాహనాల ద్వారా రైస్ మిల్లులకు తరలించుకునే దుస్థితికి తీసుకురావడం జరిగింది ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్. ఒకవైపు ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో పెద్ద మొత్తంలో వరి ధాన్యం నిలువ ఉన్నప్పటికీ, మండలంలో అతిపెద్ద కొనుగోలు కేంద్రాలైన కొన్ని కేంద్రాల్లో సుమారు 60 శాతం నుండి 35% వరకు ప్రార్ధన లేకపోవడంతో, ఇప్పుడు వర్షాలు కురుస్తాయో తమ ధాన్యం పరిస్థితి ఎలాగో అని భయంతో గురవుతున్నారు రైతులు. కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితులను, అలాగే అధికారుల మరియు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ నిర్లక్ష్యాన్ని గమనించిన రైతులు, బార్దన్లతోపాటు ట్రాన్స్పోర్ట్ ను కూడా సొంత ఖర్చుతో రైస్ మిల్లులకు తరలించి ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.
అధికారులు కాంట్రాక్టర్ చేతివాటకంతో, రైతులకు తప్పని నష్టం.
గత కొన్ని ఏళ్లుగా వడ్ల కొనుగోలు రవాణా వ్యవహారంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో, మహాదేవపూర్ మండల రైతులే కాకుండా చుట్టుపక్కల మండల రైతులు కూడా గతంలో భారీ నష్టాన్ని మిగిల్చినప్పటికీ పేద అమాయక రైతులు, అధికారుల వద్ద ప్రశ్నించే స్తోమత లేకపోవడం, కానీ అధికారులు మరియు కాంట్రాక్టర్ చేతివాటకంతో ప్రతి సంవత్సరం, ధాన్యం రవాణా పారగాన్ల సమస్య తలెత్తి రైతుకు నష్టం వాటిల్లిన చివరికి వచ్చే సంవత్సరం కూడా అదే కాంట్రాక్టర్ కు ధాన్యం రవాణా బాధ్యత అప్పగించడం జరుగుతుంది, ఈ కాంట్రాక్టర్కు ధాన్యం రవాణా కాంట్రాక్ట్ ఒక దత్తత పుత్రునిగా మారింది’ ఇది అధికారుల పుణ్యమే అంతేకాదు 10 లారీలు ఉన్న కాంట్రాక్టర్ కు వరి రవాణా ఏ కాదు, మొక్కజొన్న రవాణా కూడా ఈ కాంట్రాక్టర్ కె అప్పగించినట్లు, తెలుస్తుంది. కాంట్రాక్టర్ పై ఇలాంటి చర్యలు రాకూడదని ముందస్తుగా అధికారులు, కాంట్రాక్టర్ ని ప్రశ్నించి వాహనాల సదుపాయం ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, ఒక అడుగు ముందుకు వేసిన అధికారులు ప్రైవేట్ ఇసుక లారీలను, ధాన్యం రవాణా కొరకు పంపించడం వెనుక ఆంతర్యం ఏమిటో అధికారులకె తెలుసు. వరి కొనుగోలు రవాణా బార్ధాన్ కొరత ఈ వ్యవహారాల వెనుక అధికారుల చేతివాటకం ఉందని స్పష్టంగా కనబడుతుందని అంటున్నారు రైతులు.



