తాగునీటి సమస్య తీర్చడమే లక్ష్యంగా సర్పంచ్.

12వ వార్డులో నూతన  మోటర్ ఏర్పాటు. నాణ్యమైన విద్యను అందించుట కొరకె విద్యా వారోత్సవాలు. ‎

 తాగునీటి సమస్య తీర్చడమే లక్ష్యంగా సర్పంచ్.

12వ వార్డులో నూతన  మోటర్ ఏర్పాటు.

నాణ్యమైన విద్యను అందించుట కొరకె విద్యా వారోత్సవాలు.

‎ మండల విద్యార్థికి జిల్లా కేంద్రంలో సన్మానం.

మహాదేవపూర్,భూపాలపల్లి: మే 17 (నిజం న్యూస్)

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ వార్డుల్లో సర్పంచ్ మరియు పాలకవర్గ పర్యవేక్షణలో, వార్డ్ సభ్యుల కోరిక మేరకు మంచినీటి ఇబ్బంది లేకుండా, మోటర్ల మరమ్మత్తు, కొత్త మోటర్లు ఏర్పాటు చేసి తాగునీటి సదుపాయాన్ని వేసవికాలం ప్రారంభం నుండి మహాదేవపూర్ సర్పంచ్ హసీనా అక్బర్ ఖాన్ తనదైన శైలిలో మంచినీటి సమస్య లేకుండా చేస్తున్న క్రమంలో, 12వ వార్డులో వార్డు సభ్యులకు మంచినీటి ఇబ్బందులను గుర్తించిన సర్పంచ్ కొత్త మోటర్ ఏర్పాటుచేసి, తాగునీటి సదుపాయాన్ని అందించే కార్యక్రమం నిర్వహించారు. గత కొద్ది రోజులుగా తాగునీటి సమస్య తో ఇబ్బందులు పడుతున్న వార్డు సభ్యులకు సర్పంచ్ కొత్త మోటర్ ఏర్పాటుచేసి త్రాగునీటి సమస్య లేకుండా చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు వార్డ్ సభ్యులు

ఈనెల 11వ తేదీ నుండి మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్య వారోత్సవాల చివరి రోజు కార్యక్రమంలో, సర్పంచ్ హసీనా అక్బర్ ఖాన్ తో పాటు పిఏసిఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ హసీనా అక్బర్ ఖాన్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసించే విద్యార్థుల కు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో విద్యా వారోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అలాగే డిగ్రీ కళాశాల మరింత అభివృద్ధి దిశకు తీసుకువెళ్లి సాంకేతిక విద్య లాంటి సదుపాయాల కల్పన కోసం, మంత్రి దృష్టికి తీసుకువెళ్లి కళాశాల అభ్యున్నతికి తమ వంతు సహకరిస్తానని అన్నారు సర్పంచ్.

ఇంటర్ మొదటి రెండవ సంవత్సరంలో జిల్లా ఉత్తమ విద్యార్థిగా మార్పులు సాధించిన మహాదేవపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన సువిభా తస్లీమ్,కు జిల్లా విద్యాధికారి తో పాటు ఇతర అధికారులు, జిల్లా కేంద్రంలోని ఐ డి ఓ సి కార్యాలయంలో, విద్యా వారోత్సవాల భాగంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, సువిభా తస్లీమ్, కు సన్మానించి, పదివేల రూపాయల నగదు బహుమతితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ప్రశంస పత్రాన్ని అందించడం జరిగింది. ఉత్తమ మార్కులు సాధించి ప్రభుత్వ కళాశాలకు వెన్నె తెచ్చిన విద్యార్థికి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అలాగే ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా అభినందించారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button