‎శాఖల సమన్వయంతో విపత్తులను ఎదుర్కోవడం సాధ్యం.

‎మాక్ డ్రిల్స్ కీలక పాత్ర పోషిస్తుంది. కార్యదర్శి హరిచంద్రన. ‎

‎శాఖల సమన్వయంతో విపత్తులను ఎదుర్కోవడం సాధ్యం.

‎మాక్ డ్రిల్స్ కీలక పాత్ర పోషిస్తుంది. కార్యదర్శి హరిచంద్రన.

‎15న జిల్లా యంత్రాంగంతో టేబుల్ టాప్ ఎక్ససైజ్.

‎మే 18 రాష్ట్రవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ పై సమీక్ష.

‎కేంద్ర రాష్ట్ర లకు సంబంధించి 60 శాఖలు, ఫైర్ అండ్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్.

‎న్యూఢిల్లీ నుండి ఎన్ డి ఎం ఏ, కన్సల్టెంట్ సుధీర్ బేవాల్, సూచనలు.

‎భూపాలపల్లి, మే 7( నిజం న్యూస్)

‎విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంతో సాధ్యమవుతుందని, వాటిలోని భాగమే మార్క్ డ్రిల్స్ ఒక కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు రాష్ట్ర రెవెన్యూ విపత్తు మరియు నిర్వహణ కార్యదర్శి డి హరిచందన, రాజధాని హైదరాబాద్ నుండి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జిల్లా కలెక్టర్ తో పాటు వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా యంత్రాంగంతో కలిసి మే 15న నిర్వహించనున్న టేబుల్ టాప్ ఎక్ససైజ్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా మే 18న నిర్వహించనున్న మాక్ డ్రిల్స్ పై సమీక్షించారు. 2025 సంవత్సరంలో నిర్వహించిన విపత్తు సమయంలో వేగవంతమైన ప్రతిస్పందన తో పాటు శాఖల మధ్య సమన్వయం బలోపేతం చేయడంలో ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. ఏలాంటి ఎక్ససైజులు అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను గుర్తించడమే కాకుండా శాఖలు తమ ప్రణాళిక మరియు సిద్ధతను వ్యవతికతంగా మెరుగు పరుచుకునె అవకాశం కల్పిస్తామని కార్యదర్శి హరిచందన తెలిపారు.


‎కేంద్ర రాష్ట్ర లకు సంబంధించి 60 శాఖలు, ఫైర్ అండ్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్.

‎మీ 18న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడే మోక్రిల్స్ కార్యక్రమంలో సుమారు 60 శాఖలు మరియు కేంద్ర సంస్థలు పాల్గొనడం జరుగుతుందని అన్నారు తెలంగాణ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాస్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారు మాట్లాడుతూ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సహకారంతో 2025 డిసెంబర్లో తెలంగాణ మొదటి సారిగా వరద మరియు పారిశ్రామిక ప్రమాదాలపై మాక్ డ్రిల్స్ నిర్వహించామని అవి శాఖల మధ్య సమన్వయం మరియు వేగవంతమైన స్పందన గణనీయంగా పెంచాలని పేర్కొన్నారు.2026 సంవత్సరానికి 13 జిల్లాలో పారిశ్రామిక ప్రమాదాలపై ఐదు జిల్లాలో అటవీ అగ్ని ప్రమాదాలపై మరో నాలుగు జిల్లాల్లో మాక్ డ్రింక్స్ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

‎న్యూఢిల్లీ నుండి ఎన్ డి ఎం ఏ, లీడ్ కన్సల్టెంట్ సుధీర్ బేవాల్, సూచనలు.

‎మాక్ డ్రిల్స్ కు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణలో దేశ రాజధాని న్యూఢిల్లీ నుండి పర్చూర్ సమావేశంలో ఎన్ డి ఎం ఏ, లీడ్ కన్సల్టెంట్ మేనేజర్ జనరల్ సుధీర్, విశ్రాంత కన్సల్టెంట్, వరదలు మరియు పరిశ్రామిక ప్రమాదాలు అటవీ అగ్ని ప్రమాదాల సమయంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల బాధ్యతలు, నివారణకై అమూల్యమైనటువంటి సలహాలను అందించడం జరిగింది. అలాగే మార్క్ డ్రిల్స్ నిర్వహణకు సంబంధించి పలు ముఖ్యమైన సూచనలను కూడా అందించారు మేనేజర్ జనరల్ కన్సల్టెంట్ సుధీర్. ఈ సమావేశంలో ఐడిఓసి కార్యాలయం నుండి ఆర్డిఓ హరికృష్ణ జిల్లా అగ్నిమాపక అధికారి సతీష్ ఏ ఎస్ పి నరేష్ కుమార్ డిఇఓ రాజేందర్ కలెక్టర్ డి సెక్షన్ పర్యవేక్షకులు రామారావు ఆర్ ఐ కాశీరాం తో పాటు అంది మండలాల తాసిల్దారులు పాల్గొనడం జరిగింది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button