గత పొరపాట్లు పునరావృతం కాకూడదు
గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా, సమస్యల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని

మహాదేవపూర్, భూపాలపల్లి: మే 7 (నిజం న్యూస్)
గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా, సమస్యల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, సరస్వతీ అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ అధికారులకు ఆదేశించారు. గురువారం రోజు సరస్వతీ అంత్య పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల ఏర్పాట్ల పనులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆలయ కార్య నిర్వహణ అధికారి కార్యాలయంలో, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ సిరి శెట్టి సంకీర్త్, తో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈనెల 21 తేదీ గురువారం నుండి జూన్ ఒకటవ తేదీ వరకు నిర్వహించబడే అంత్య పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడం జరుగుతుందని, భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రైవేట్ వాహనాలకు మరియు ఆర్టీసీ బస్సులకు వేరు వేరు మార్గాలను ఏర్పాటు చేస్తూ, 260 ఎకరాలలో,24 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయనున్నట్లు, పరార్ కింగ్ ప్రాంతాల్లో తాగునీటి సమస్య మరియు విద్యుత్ సదుపాయాలు కల్పించడంతోపాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో, ప్రతి కిలోమీటర్ కు ఒక చలివేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ. సరస్వతి ఘాట్ వద్ద తాత్కాలిక సదుపాయాలు కల్పించడంతోపాటు, షాపింగ్ స్టాల్స్ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, చిన్న పరిశ్రమల ఉత్పత్తుల ప్రోత్సహించే విధంగా 50 స్టాల్స్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాగే గోదావరి తీరం వద్ద పిండ ప్రధాన కోసం ప్రత్యేక చలవ పందిరిలో ఏర్పాటు తోపాటు పూజ కార్యక్రమాలు నిర్వహించుటకు వెసులుబాటు కల్పించడం జరుగుతుందని తెలిపారు. 20 పడకలతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం. 21వ తేదీ ఉదయం 5:43 నిమిషాలకు కాలేశ్వరం త్రివేణి సంగమం వద్ద పుష్కర పుణ్యస్నానం ఆచరించడం ప్రారంభమవుతుందని. గతంలో ఆది పుష్కరాల్లో స్నానం చేయని భక్తులు, అంత్య పుష్కరాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తారని పేర్కొన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లతో పాటు జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.



