టీవీకే ఘన విజయం వెనుక కపిల్ సాహూ మాస్టర్ ప్లాన్..!

తమిళనాడు రాజకీయాల్లో అప్రతిహత విజయంతో సంచలనం సృష్టించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ గెలుపు వెనుక కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా రాజకీయ వ్యూహకర్త కపిల్ సాహూ పేరు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన కపిల్ సాహూ, రాజకీయ కన్సల్టింగ్ రంగంలో కొత్త తరం వ్యూహకర్తగా ఎదుగుతూ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు.

తమిళ రాజకీయాల్లో సంచలనం!

చెన్నై, మే 5:
తమిళనాడు రాజకీయాల్లో అప్రతిహత విజయంతో సంచలనం సృష్టించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ గెలుపు వెనుక కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా రాజకీయ వ్యూహకర్త కపిల్ సాహూ పేరు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన కపిల్ సాహూ, రాజకీయ కన్సల్టింగ్ రంగంలో కొత్త తరం వ్యూహకర్తగా ఎదుగుతూ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు.

ఉన్నత విద్య పూర్తిచేసిన అనంతరం ప్రముఖ రాజకీయ కన్సల్టింగ్ సంస్థ ఐ-ప్యాక్ (I-PAC)లో పనిచేసిన కపిల్, రెండేళ్ల క్రితం తన బృందంతో కలిసి ఆ సంస్థను వీడి స్వతంత్రంగా ప్రయాణం ప్రారంభించారు. సుమారు 12 మంది సభ్యులతో కూడిన కోర్ టీంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తూ విలువైన అనుభవాన్ని సంపాదించారు.

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి వ్యూహకర్తగా పనిచేసి విజయాన్ని అందించిన అనంతరం, తమిళనాడులో సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి సేవలందించారు. ముఖ్యంగా ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దూరమైన తర్వాత, టీవీకే ఎన్నికల బాధ్యతలను కపిల్ సాహూ తన భుజాలపై తీసుకున్నారు.

అభ్యర్థుల ఎంపిక, వారి బలాబలాల విశ్లేషణ, పార్టీ నిర్మాణం, ఎన్నికల ప్రచార వ్యూహాలు, డేటా అనలిసిస్, సర్వేలు, డిజిటల్ క్యాంపెయిన్లు, మీడియా కమ్యూనికేషన్ వంటి అన్ని కీలక అంశాల్లో కపిల్ సాహూ బృందం సమగ్రంగా పనిచేసింది. ముఖ్యంగా ఓటర్లతో నేరుగా అనుసంధానం పెంచే విధానాలు, గ్రౌండ్ లెవెల్ ఆర్గనైజేషన్ బలోపేతం చేయడం వంటి చర్యలు పార్టీ విజయానికి బలమైన పునాది వేశాయి.

ఈ కృషి ఫలితంగా కేవలం రెండేళ్ల క్రితం స్థాపించబడిన టీవీకే పార్టీ, తమిళ రాజకీయాల్లో అద్భుత విజయాన్ని సాధించి ప్రధాన శక్తిగా అవతరించింది. దశాబ్దాల చరిత్ర కలిగిన డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలను వెనక్కు నెట్టుతూ భారీ ఓటు బ్యాంక్‌ను సాధించడం విశేషంగా మారింది.

రాజకీయ వ్యూహకర్తగా కపిల్ సాహూ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుండగా, భవిష్యత్తులో మరిన్ని కీలక రాజకీయ ప్రాజెక్టుల్లో ఆయన పాత్ర ఉండనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button