ఇంజన్ ఆయిల్ కొంటేనే పెట్రోల్.. లేదంటే వెళ్లిపోండి
హుజూర్ నగర్ పట్టణ పరిధిలోని వేపల సింగారం వెళ్లే మూల మలుపు వద్ద గల ఓ పెట్రోల్ బంకు ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

బంకు నిర్వాహకుల ‘కండిషన్’.. షాక్‌లో వాహనదారులు*..!
*హుజూర్ నగర్ పెట్రోల్ బంకులో వింత నిబంధన: ఆయిల్ కొంటేనే పెట్రోల్*..!
*కృత్రిమ కొరతతో దోపిడీ*?
*బంకు వ్యవహారంపై సోషల్ మీడియాలో సెటైర్లు*..!
హుజూర్ నగర్ పట్టణ పరిధిలోని వేపల సింగారం వెళ్లే మూల మలుపు వద్ద గల ఓ పెట్రోల్ బంకు ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
బైపాస్ రోడ్డులో ఉన్న సదరు హెచ్‌పి (HP) పెట్రోల్ బంకులో వినియోగదారులకు వింత అనుభవం ఎదురవుతోంది.
గత రెండు రోజులుగా పట్టణంలో ఇంధన కొరత ఏర్పడటాన్ని ఆసరాగా చేసుకొని, సదరు బంకు నిర్వాహకులు కండిషన్ పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఎవరైనా ఒక లీటర్ ఇంజన్ ఆయిల్ కొంటేనే, వారికి వెయ్యి రూపాయల పెట్రోల్ పోస్తామని నిర్వాహకులు తెగేసి చెబుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజులుగా పెట్రోల్ సరఫరాలో అంతరాయం కలగడంతో, బంకు యజమానులు కావాలనే కృత్రిమ కొరతను సృష్టించి తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పెట్రోల్ దొరకని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఇంజన్ ఆయిల్ కొనుగోలు చేస్తుండగా, మరికొందరు ఈ దోపిడీపై సోషల్ మీడియా వేదికగా నిరసన తెలుపుతున్నారు.
లీటర్ ఆయిల్ కొంటేనే వెయ్యి రూపాయల పెట్రోల్” అనే వార్త ఇప్పుడు స్థానిక వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
పెట్రోల్ కొరతను సాకుగా చూపి వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇలాంటి చర్యలపై సంబంధిత శాఖ అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.



