గడ్డివాములకు నిప్పు పెట్టిన దుండగులు… రైతు కుటుంబంలో తీవ్ర విషాదం
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు నర్సింగ్ నారాయణ తన పశువుల మేత కోసం ఏడాది పొడవునా కష్టపడి పండించిన గడ్డిని నిల్వ చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని దుండగులు గడ్డివాముకు నిప్పు పెట్టారు. మంటలు వేగంగా వ్యాపించడంతో గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ సమాచారం అందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

గడ్డివాముకు నిప్పు…రూ. 50,000/- వేల ఆస్తి నష్టం..!
సూర్యాపేట, నిజం చెపుతాం న్యూస్
హుజూర్ నగర్ మండల పరిధిలోని వేపల సింగారం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు గడ్డివాములకు నిప్పు పెట్టిన ఘటన రైతు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు నర్సింగ్ నారాయణ తన పశువుల మేత కోసం ఏడాది పొడవునా కష్టపడి పండించిన గడ్డిని నిల్వ చేసుకున్నారు.
గురువారం మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని దుండగులు గడ్డివాముకు నిప్పు పెట్టారు. మంటలు వేగంగా వ్యాపించడంతో గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ సమాచారం అందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 వేల విలువైన పశుగ్రాసం పూర్తిగా బూడిదైంది. ఏడాది కష్టం కళ్లముందే బూడిద కావడంతో బాధితుడు నారాయణ కన్నీరుమున్నీరవుతున్నారు.
పశువులకు మేత ఎలా వేయాలో అర్థం కావడం లేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం స్పందించి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి తమను తక్షణమే ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నారు.



