హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

గురువారం హుజూర్ నగర్ లోని ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో పలువురు డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, సమయం కంటే ముందే వెళ్ళిపోవడంపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

నిజం ఎఫెక్ట్…

వైద్యులు రోగులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు.

గురువారం హుజూర్ నగర్ లోని ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో పలువురు డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, సమయం కంటే ముందే వెళ్ళిపోవడంపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఓపి (OP) విభాగంలో సమయపాలన పాటించని మరియు గైర్హాజరైన డాక్టర్లు, కాంట్రాక్ట్ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. దీనిపై పూర్తి నివేదిక కోరారు.

అనంతరం డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంక్, ఎమర్జెన్సీ వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

కొత్తగా నిర్మిస్తున్న ఓపి బ్లాక్ పనులను వేగవంతం చేయాలని, సిటీ స్కాన్ మిషన్ పనితీరును మెరుగుపరచాలని, టి-హబ్ (T-Hub) లోపాలను వెంటనే సరిచేయాలని అధికారులను ఆదేశించారు.

ఆసుపత్రి పారిశుధ్య నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, శానిటేషన్ సిబ్బందిని మరియు నర్సింగ్ ఆఫీసర్లను కలెక్టర్ అభినందించారు. “కాయకల్ప” అవార్డు సాధించే దిశగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని

సాధారణ ప్రసవాలు (Normal Deliveries) పెరిగేలా అవగాహన కల్పించాలని,  ప్రభుత్వ ఆరోగ్య పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ రవి కుమార్, డాక్టర్ వనజ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button