ప్రాజెక్టు రీ డిజైనింగ్ అవినీతికి కేరాఫ్ కాలేశ్వరం. ముఖ్యమంత్రి

నిజాలు తెలివాలని ఈరోజు, టెక్నికల్ విజిట్ పొలిటికల్ కాదు. మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేక తో ఎదురుదాడికి ప్రయత్నం. ఢిల్లీ పర్యటన వెనుక రహస్యం ఏమిటి. ఎనిమిది గంటల్లో సిబిఐ విచారణ అన్న కేంద్రం ఎక్కడ. రెండు గంటల పాటు ముఖ్యమంత్రి బ్యారేజ్ పరిశీలన.

ప్రాజెక్టు రీ డిజైనింగ్ అవినీతికి కేరాఫ్ కాలేశ్వరం. ముఖ్యమంత్రి.

నిజాలు తెలివాలని ఈరోజు, టెక్నికల్ విజిట్ పొలిటికల్ కాదు.

మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేక తో ఎదురుదాడికి ప్రయత్నం.

ఢిల్లీ పర్యటన వెనుక రహస్యం ఏమిటి.

ఎనిమిది గంటల్లో సిబిఐ విచారణ అన్న కేంద్రం ఎక్కడ.

రెండు గంటల పాటు ముఖ్యమంత్రి బ్యారేజ్ పరిశీలన.

మహాదేవపూర్, భూపాలపల్లి, ఏప్రిల్ 20( నిజం న్యూస్)

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై 700 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మదిలో వచ్చిన ఆలోచన, దీనివల్ల ఇలాంటి ప్రయోజనం లేదని అలాగే ఆర్థిక రాజకీయంగా ప్రయోగం లేదని భావించి ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరు మీద కాలేశ్వరం అని అవినీతికి పాల్పడం జరిగిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సుదీర్ఘంగా రెండు గంటలపాటు పరిశీలించిన ముఖ్యమంత్రి, అలాగే మంత్రుల బృందం అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.మెడిగడ్డ సుదర్శన మరియు రైతు భరోసా కార్యక్రమానికి హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయం నుండి మూడు గంటలకు బయలుదేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తో ముఖ్యమంత్రి బృందం నాలుగు గంటల ఐదు నిమిషాలకు కాళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన ఎలిప్యాడ్ వద్ద చేరి అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా, కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవడంతో ఎండోమెంట్ శాఖ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు, మంత్రులకు అలాగే ఎంపీ వంశీకృష్ణ తో పాట్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు పూర్ణకుంభ స్వాగతం పలకడం జరిగింది.

అనంతరం ముఖ్యమంత్రి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించిన అనంతరం, ఎండోమెంట్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు, సన్మానించి పట్టు వస్త్రాలు ముక్తేశ్వర స్వామి ప్రసాదం తో పాటు, మెమొంటోలను అందించడం జరిగింది. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు పాల్గొని, 198 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి, అలాగే కాలేశ్వరం ఆర్టీసీ నూతన ప్రయాణ ప్రాంగణానికి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తిరిగి కాలేశ్వరం నుండి హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డ కు బయలుదేరిన ముఖ్యమంత్రి, లక్ష్మీ బ్యారేజ్ పరిశీలన అనంతరం, ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మేడిగడ్డ సందర్శన కు సంబంధించి పూర్తి వివరాలను ఈ సమావేశం ద్వారా వివరించారు ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఏర్పాటు పునాదులు ఏర్పాటుచేసిన దానికి కాలేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చి, తుమ్మిడి శెట్టి దగ్గర ఏర్పాటు చేయాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ, అన్నారం సుందిళ్లకు మార్చి, 38 వేల కోట్ల ఉన్న అంచనాన్ని లక్ష 50 వేల కోట్లకు పెంచి, రాజకీయ ఆర్థిక రైతునాలతో పాటు తనకు తాను ప్రచారం కొరకు,రి డిజైన్ పేరుతో దోపిడీ చేయడమే లక్ష్యంగా వేడి గడ్డ నిర్మించడం జరిగిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

 

అలాగే 2016 లో ప్రారంభించి 2019లో ప్రాజెక్టు పూర్తి చేశామని ప్రపంచవ్యాప్తంగా ప్రచారానికి తెరలేపి ఒక అద్భుత పట్టణమని సృష్టించి, అప్పటి గవర్నర్ కు అబద్ధాల పుట్టలో వేసి, ఇది ఒక అద్భుత కట్టడం అని బూచిగా చూపెట్టి 2018 ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కూడా పొందడం జరిగిందని చెప్పారు ముఖ్యమంత్రి. 2020 లోని గ్యారేజ్ లో లీకులు ఉన్నాయని ఎల్ ఎన్ టి సంస్థకు ఇంజనీర్లు తెలపడం జరిగిందని, కానీ పట్టించుకోకపోవడంతో 2023లో ప్రాజెక్ట్ కుప్పకూలిందని అన్నారు, సంఘటనను పోలీస్ స్టేషన్లో అధికారులు నమోదు చేసినప్పటికీ, తిరిగి ఎన్నికల్లో లబ్ది కొరకు విషయాన్ని బయటికి రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసి, దుర్మార్గమైన ఆలోచన తిరిగి ప్రాజెక్ట్ పేరుతో లబ్ధి పొందే ప్రయత్నాన్ని ప్రకృతి బయటపెట్టిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.2023 లో ఎన్ డి ఎస్ ఆర్ ఏ నాణ్యత లోపం ఉందని నివేదిక రాజ్య ప్రస్తుత పరిస్థితిలో నీళ్లు విలువ చేయడం కూడా ప్రమాదం అని, ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర రావు హయాంలో నివేదిక అందించిందని, కానీ స్పందించకుండా ఎదురుగాడి చేయడమే తప్ప విచారణ చేయలేదు ఈ దే క్రమంలో విజిలెన్స్ కూడా, తమ నివేదిక అందించడం జరిగింది.

 

అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విచారణకు జ్యూడిషల్ కమిషన్ వేయడంతో బీసీ ఘోష్ 640 పేజీల రిపోర్టును సవివరంగా, తప్పిదాల వివరాలను అందించడం జరిగిందని అన్నారు. గుడిషన్ విచారణ ఇచ్చిన నివేదిక రాష్ట్ర అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించి, మల్టీ స్టేట్ సమస్యలతో పాటు ఆర్థిక లావాదేవీలతో కూడిన సంస్థల సహకారం ఉందని, ఇలాంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న విచారణ సంస్థల ద్వారా సంపూర్ణమైన విచారణ సాధ్యం దాని పరిస్థితి కనబడుతుందని, దీనికి సంబంధించి శాసనసభలో సుదీర్ఘమైన చర్చను జరిపి ప్రతిపక్షాలను అవకాశం కల్పించిన అనంతరం, సిబిఐ విచారణకు అప్పగించి సంపూర్ణ విచారణ చేసి బాధ్యులను శిక్షించాలని అప్పగించడం జరిగిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సిబిఐ కు అప్పగించి 9 నెలలు అవుతుందని, కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు సిబిఐ విచారణకు ఆదేశించలేదని, తిరిగి మళ్లీ కేంద్ర ప్రభుత్వానికి విచారణ కొరకు కోరడం జరిగిందని, 2019లో ప్రారంభమైన ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలు నిర్మాణ సంస్థకు అందించినప్పటికీ, కేవలం 166 టీఎంసీల నీటిని మాత్రమే అందించగలిగిందని, 32 టీఎంసీలు తిరిగి సముద్రంలోకి మళ్లించాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు ముఖ్యమంత్రి, లక్ష కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఇలాంటి దృష్టికి తీసుకువచ్చి కాలేశ్వరం ప్రాజెక్టుని వదిలిపెట్టారని అన్నారు,

ప్రజల సొమ్ము లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టును గాలికి వదిలిపెట్టలేమని, అలాగని తిరిగి ప్రారంభించి పరిస్థితి, మరమ్మత్తు చేసే దిశగా తీసుకువెళ్లే క్రమంలో మరిన్ని కోట్ల రూపాయల ఖర్చు భారం పడే పరిస్థితి వచ్చిందని అన్నారు, ఇలాంటి పరిస్థితుల్లో మేడిగడ్డ శాస్త్రీయ పరంగా సాంకేతిక లోపాలను గుర్తించి, పూర్తిస్థాయి మరమ్మత్తు పనులను చేపట్టి, ప్రాజెక్ట్ పనులు ప్రారంభించి రాష్ట్రానికి నీళ్లు అందించే దిశగా ప్రయత్నం కొరకు, సాంకేతిక నిప్పుల తో కూడిన బృందాన్ని తీసుకువచ్చి, పొలిటికల్ మరియు రాజకీయానికి తావు లేకుండా, ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ విసిట్ గా భావించి రావడం జరిగిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తక్షణమే కాలేశ్వరం మీద సిబిఐ విచారణ జారీ చేయకపోతే ఆందోళన చేపడుతామని కేంద్ర ప్రభుత్వానికి సమాచారం పంపడం జరిగిందని, దానికి భయపడి ఎక్కడ విచారణకు ఆదేశిస్తారని, హరీష్ రావు, వినోద్ రావు, బిజెపి నాయకుల కాళ్లు పట్టుకోవడానికి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టిఆర్ఎస్ పార్టీ కండలు పెరిగించే వ్యక్తి జీవన్ రెడ్డి పార్టీలో చేరుతున్న క్రమంలో మీరు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. ప్రశ్నించారు ముఖ్యమంత్రి. మీడియా బయట పెట్టే వరకు, హరీష్ రావు వినోద రావు ఢిల్లీ ప్రయాణం బయటకు రాలేదని, ఇన్ని రోజుల నుండి బిజెపి పార్టీని తొత్తుగా ఉండి సిబిఐ విచారణకు అడ్డుకోవడం జరుగుతుందని స్పష్టంగా కనబడుతుంది అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్. బిజెపి పార్టీని అడ్డం పెట్టుకొని అవినీతిని కప్పిపుచ్చుకుంటాం అంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, కాలేశ్వరం పై స్పష్టమైన కార్యాచరణ కొరకు ప్రభుత్వం సిద్ధం చేయక తప్పదని హెచ్చరించారు ముఖ్యమంత్రి. అలాగే కాలేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నదాంట్లో సాంకేతిక నిపుణుల సహాయంతో, ప్రాజెక్ట్ మరమ్మత్తులు చేపట్టి సాధ్యమైనంత త్వరలో రాష్ట్ర ప్రజలకు కాలేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్లు అందించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని స్పష్టం చేశారు. అలాగే తుమ్మడిశెట్టి ప్రాజెక్టును కూడా తిరిగి ప్రారంభించి అక్కడి నుండి శ్రీ పద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీరు అందించేలా కార్యచరణాన్ని ప్రభుత్వం చేపడుతుందని అన్నారు ముఖ్యమంత్రి. హరీష్ రావు నెక్కెర తొలక ముందే, శ్రీ పద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ కట్టిందని, అన్ని ప్రాజెక్టులకు కేంద్ర బిందువు శ్రీ పద ఎల్లంపల్లి ప్రాజెక్టు అన్న విషయం హరీష్ రావు కు తెలవదు అన్న విషయం స్పష్టమైందని అన్నారు. ప్రాజెక్టులు దోషులను వదిలిపెట్టేది లేదని, ఉన్నదాంట్లో ప్రాజెక్టును రిపేరు చేసి రాష్ట్ర ప్రజలకు నీళ్లు అందించే దిశగా ప్రయత్నం చేస్తామని అన్నారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.

రెండు గంటల పాటు ముఖ్యమంత్రి బ్యారేజ్ పరిశీలన.

కాలేశ్వరంలో కార్యక్రమాలు ముగించుకొని నాలుగు గంటల 26 నిమిషాలకు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల బృందం, 6 గంటల 45 నిమిషాల వరకు సుమారు రెండు గంటల పాటు, కుంగిపోయిన ఏడవ బ్లాక్ లోని పిల్లర్ల మరమ్మత్తు విషయంపై, సుదీర్ఘంగా చర్చించారు. ఎల్ ఎన్ టి అధికారులతో పాటు, ఇరిగేషన్ అధికారులు అలాగే ఎన్ డి ఎస్ ఏ చైర్మన్ అనిల్ జాయిన్, ఆధ్వర్యంలో లక్ష్మీ బ్యారేజ్, మరమ్మత్తు విషయాలను సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. పిల్లర్ నంబర్ 20 21 22 వద్ద బోర్ రీచ్ ద్వారా జియో టెక్నాలజీ జియో ఫిజికల్ జిపిఆర్ షాంపూల్స్ సేకరణ పనులు పరిశీలించారు ముఖ్యమంత్రి,520 బోర్ రింగ్స్ ద్వారా శాంపిల్ సేకరించి సిడబ్ల్యూపిఆర్ఎస్ ప్రభుత్వం పంపనున్నట్లు తెలిపారు, ల్యాబ్ పరీక్షల అనంతరం బ్యారేజ్ డ్యామేజి పై పూర్తి అవగాహన రానుందని వివరించారు అధికారులు. లక్ష్మీ బ్యారేజ్ వద్ద పరిశీలన కు పెద్ద మొత్తంలో ముఖ్య మంత్రి మంత్రులతో సహా సమయాన్ని కేటాయించి, అక్కడ జరుగుతున్న పనులను పరీక్షించడం, పనులు నిర్వహిస్తున్న సిబ్బందితో ముఖ్యమంత్రి స్వయంగా అడిగి తెలుసుకోవడం జరింది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button