కాలేశ్వరానికి బయలుదేరిన ముఖ్యమంత్రి.
కాలేశ్వరం మేడిగడ్డ పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,

కాలేశ్వరానికి బయలుదేరిన ముఖ్యమంత్రి.
మహదేవపూర్, భూపాలపల్లి (నిజం న్యూస్)
కాలేశ్వరం మేడిగడ్డ పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మూడు గంటలకు బేగంపేట్ విమానాశ్రయం నుండి కాలేశ్వరానికి బయలుదేరడం జరిగింది. ముఖ్యమంత్రి తోపాటు మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ పొన్నం ప్రభాకర్ ఎన్ డి ఎస్ ఏ చైర్మన్ అనిల్ జైన్, లు ఉన్నారు నాలుగు గంటలకు , అనగా మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు మంత్రుల బృందం కాళేశ్వరం వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ కు చేరనుంది, అక్కడినుండి రోడ్డు మార్గం ద్వారా, కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనం ప్రత్యేక పూజ అనంతరం, ఆలయ అభివృద్ధి పనుల భూమి పూజ కార్యక్రమం నిర్వహించి, అక్కడినుండి వేడిగడ్డ సందర్శనకు బయలుదేరడం జరుగుతుంది.



