సి ఎమ్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి

రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఏప్రిల్ 20వ తేదీ సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటాన వివరాలు,మధ్యాహ్నం 1.45 గంటలకు నివాసం నుంచి బయలుదేరి

సి ఎమ్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి

రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఏప్రిల్ 20వ తేదీ సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటాన వివరాలు,మధ్యాహ్నం 1.45 గంటలకు నివాసం నుంచి బయలుదేరి 2.00 గంటలకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3.00 గంటలకు కాలేశ్వరం ఆలయానికి చేరుకుంటారు.3.05 నుండి 3.25 గంటల మధ్య శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసి, ఆలయంలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.3.30 గంటలకు కాలేశ్వరం నుంచి బయలుదేరి 3.45 గంటలకు మహాదేవపూర్ మండలం మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడ 3.45 నుండి 4.30 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు.
4.35 నుండి 5.30 గంటల వరకు అంబట్‌పల్లి గెస్ట్ హౌస్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 5.35 నుండి 6.00 గంటల వరకు మీడియా సమావేశంలో పాల్గొంటారు.
6.00 గంటలకు మేడిగడ్డ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 6.30 గంటలకు కాటారం మండలం నస్తూరపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ 6.30 నుండి 7.45 గంటల వరకు రైతు భరోసా పథకం రెండో విడత నిధులను విడుదల చేస్తారు.తదుపరి 7.45 గంటలకు నస్తూరపల్లి నుంచి బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుంటారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button