రైతుల సమక్షంలో రెడ్డి రైతు భరోసా,మంత్రి తుమ్మల
రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 5563 కోట్ల రూపాయలు విడుదల. రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

రైతుల సమక్షంలో రెడ్డి రైతు భరోసా,మంత్రి తుమ్మల
రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 5563 కోట్ల రూపాయలు విడుదల.
రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం.
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మహాదేవపూర్, భూపాలపల్లి: ఏప్రిల్ 19 (నిజం న్యూస్)
ఆదివారం కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో సోమవారం జరగనున్న రైతు భరోసా నిధుల విడుదల బహిరంగ సభను. రాష్ట్ర వ్యవసాయ, సహకార, జౌళి, చేనేతల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు,రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి సిరిశెట్టి సంకీర్త్, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి భారత దేశంలో లక్షా 10 వేల కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్ర మని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నిధులు, నీళ్లు, నియామకాల మీద ఏర్పడిన గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తరతరాలకు ఉపయోగపడేలా నివేదికల ఆధారంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం అభివృద్ధికి 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఇచ్చిన మాటలకు అనుగుణంగా ప్రతి ఎకరాకు సంవత్సరానికి రెండు దఫాలుగా 12,000 వేల రూపాయలు రైతు భరోసా విడుదల చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తదుపరి 73 లక్షల మంది రైతులకు కోటి 15 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.
రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం.
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతాంగ సోదరులకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత రైతు భరోసా విడుదల కార్యక్రమం లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాటారం మండలం నస్తురుపల్లి నుండి నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ, వ్యవసాయ పనిముట్లు, రైతు భరోసా, సన్నవడ్లకు క్వింటాళ్లుకు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజును చేసేందుకు ముందుకెళ్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సోమవారం కాలేశ్వరం సందర్శించి స్వామిని దర్శించుకుంటారని, కాలేశ్వరం అభివృద్ధికి సంబంధించిన 200 కోట్ల రూపాయలతో చేపట్టిన మాస్టర్ ప్రణాళిక కార్యక్రమానికి భూమి పూజ, శిలాఫలకం ఆవిష్కరణ తదుపరి, మేడిగడ్డ సందర్శన ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తంకుమార్ రెడ్డి, సహచర మంత్రులు పాల్గొననున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం నాణ్యతలేని బ్యారేజీ నిర్మాణం వల్ల వినియోగించేందుకు వీలుపడకపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అధికారులు పుణే పులతో ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా ప్రాజెక్టును వినియోగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందన్నారు. గత.ప్రభుత్వం ప్రాజెక్టు కట్టడానికి ప్రాధాన్యత ఇచ్చారు కానీ నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన తెలిపారు. డ్యామ్ సేఫ్టీ అధికారులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జలవనరుల సంగం నివేదపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల సొమ్మును సద్వినియోగం చేసి ప్రాజెక్టు ఉపయోగపడాలన్న ఆలోచనతో ఉన్నామని తెలిపారు. సీఎం ఈ ప్రాంతానికి రావడం, రైతు భరోసా నిధులు చేయడం ఈ ప్రాంతానికి ఎంతో గర్వకారణమని రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యకమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల తదితరులు పాల్గొన్నారు.



