నిజం న్యూస్ ఎఫెక్ట్..పాఠశాల వదిలిపెట్టి ఇసుక క్వారీ పనికి వెళ్లిన ఉపాధ్యాయుడిపై MEO విచారణ
వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు పెట్టిన ఉపాధ్యాయుడు. పూర్తిస్థాయి రికార్డులు పరిశీలించి, ఉపాధ్యాయునికి వార్నింగ్. మరొకసారి ఇలాంటి తప్పు జరగదు. హామీ ఇచ్చిన ఉపాధ్యాయుడు. విద్యాధికారి బి తిరుపతి తక్షణ చర్యలు భేష్, విధుల పట్ల నిర్లక్ష్యం సహించేది ఉండదు.
’”నిజం న్యూస్ ఎఫెక్ట్” పాఠశాల సందర్శించిన ఎమ్ ఈ ఓ.
వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు పెట్టిన ఉపాధ్యాయుడు.
పూర్తిస్థాయి రికార్డులు పరిశీలించి, ఉపాధ్యాయునికి వార్నింగ్.
మరొకసారి ఇలాంటి తప్పు జరగదు. హామీ ఇచ్చిన ఉపాధ్యాయుడు.
విద్యాధికారి బి తిరుపతి తక్షణ చర్యలు భేష్, విధుల పట్ల నిర్లక్ష్యం సహించేది ఉండదు.
పలిమెల, మహాదేవపూర్: ఏప్రిల్ 18 (నిజం న్యూస్)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలం దమ్ముర్ ఎంపీపీ ఎస్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, విధులకు రాకుండా, ఇసుక క్వారీ టార్పాల్ వేసి పనికి వెళ్లడంతో, నిజం న్యూస్ “ఉద్యోగం కన్నా ఇసుక క్వారీ ముద్దు”పాఠశాల వదిలిపెట్టి ఇసుక క్వారీ పనికి వెళ్లిన ఉపాధ్యాయుడు.
అనే కథనాన్ని శుక్రవారం రోజు, ప్రచురించగా, స్పందించిన మండల విద్య అధికారి బి తిరుపతి, శనివారం రోజు దమ్ముర్ పాఠశాల ను సందర్శించి, ఉపాధ్యాయుడు లక్ష్మణ్ విధులకు హాజరు కాకుండా ప్రైవేట్, ఇసుక క్వారీ టార్పాల్ పనికి వెళ్లడానికి గల కారణాలు, ప్రధాన ఉపాధ్యాయుని అనుమతితో వెళ్లడం జరిగిందా, అనుమతి పత్రాన్ని సమర్పించి సెలవు తీసుకోవడం జరిగిందా అని, పలిమెల విద్య అధికారి తిరుపతి, పాఠశాలలోని రికార్డును అలాగే ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలను పరిశీలించారు, 16వ తేదీ ఉపాధ్యాయుడు తిరుపతి, శుక్రవారం రోజు తన వ్యక్తిగత పనుల నిమిత్తం, సెలవు కొరకు ప్రధాన ఉపాధ్యాయునికి అనుమతి పత్రాన్ని అందించడంతోపాటు, ఆన్లైన్ రికార్డుల్లో సైతం, 17వ తేదీ శుక్రవారం సెలవు కొరకు క్యాజువల్ లీవ్ పర్సనల్ వర్క్ కొరకు నమోదు చేయడం జరిగిందని, విద్య అధికారి తిరుపతి తెలపడం జరిగింది. వ్యక్తిగత సెలవు కేవలం, గృహ అవసరాల నిమిత్తం తో పాటు ఇతర పనులను చేసుకొనుటకు సెలవు ఇవ్వడం జరుగుతుంది కాని పాఠశాలకు సెలవు పెట్టి, ఆదాయం వచ్చే వేరే పనులు చేపట్టడం ప్రభుత్వ ఉద్యోగి ఇలాంటి వ్యవహారాన్ని చేపట్టడం, విధులకు విరుద్ధమని, ఉపాధ్యాయుడు లక్ష్మణ్ పై విద్యాధికారి తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు, అలాగే ఉపాధ్యాయుడు సక్రమంగా విధి నిర్వహణ కు హాజరు అవుతున్నాడా లేదా అనేది ప్రధాన ఉపాధ్యాయులు తో పాటు, ఇతరుల నుండి అడిగి తెలుసుకోన్నారు. ఉపాధ్యాయుడు లక్ష్మణ్ ముందస్తు సమాచారం అందించడం జరగడంతో అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకొనుటకు వీలులేదని, మరొకసారి ఇలాంటి, వ్యవహారాన్ని పునరావృతం కాకుండా చూడాలని ఉపాధ్యాయునికి హితవు పలికినట్లు ఎంఈఓ తిరుపతి తెలిపారు.
మరొకసారి ఇలాంటి తప్పు జరగదు. హామీ ఇచ్చిన ఉపాధ్యాయుడు.
విద్యాధికారి పాఠశాల తనిఖీ తో పాటు ఉపాధ్యాయుడు లక్ష్మణ్, సెలవు పెట్టి ప్రైవేట్ పనికి వెళ్లడం పై విద్య అధికారి తిరుపతి వివరణ కోరగా, తాను ముందస్తు సెలవు కొరకు సమాచారం, దరఖాస్తు ఇవ్వడం జరిగిందని కానీ, నాకు సెలవు పెట్టి ఇతర పనులకు, వెళ్లకూడదు అన్న విషయం తెలవదని, మరొకసారి ఇలాంటి తప్పు జరగదని ఉపాధ్యాయుడు లక్ష్మణ్, విద్య అధికారి తిరుపతికి హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు.
విద్యాధికారి బి తిరుపతి తక్షణ చర్యలు భేష్, విధుల పట్ల నిర్లక్ష్యం సహించేది ఉండదు.పలివెల మండలంలోని దమ్ముర్ ఎంపీపీ ఎస్ పాఠశాలకు చెందిన లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు, పాఠశాలకు సెలవు పెట్టి, ప్రైవేట్ ఇసుక క్వారీ టార్పాల్ పనికి వెళ్లిన వ్యవహారంపై, మండల విద్యాధికారి బి. తిరుపతి శనివారం ఉదయాన్నే, మారుమూల అటవీ ప్రాంతమైన దమ్ముర్ గ్రామానికి చేరుకొని పాఠశాల తనిఖీ చేసి, ఉపాధ్యాయుని వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మరొకసారి ఇలాంటి సంఘటన తిరుణావృతం కాకుండా ప్రధాన ఉపాధ్యాయుడు సెలవుల విషయంలో జాగ్రత్త వహించాలని, ఉపాధ్యాయునికి తెలవని పరిస్థితిలో ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగిందని, ఉపాధ్యాయుడు తనకు తెలవకుండా జరిగిన తప్పులు మన్నించాలని తెలపడం, సుమారు రెండు గంటల పాటు విద్యాధికారి పాఠశాల లో ఉండి పూర్తిస్థాయి, విచారణ తో పాటు రిజిస్టర్ల తనకి, ఉపాధ్యాయుల విధులకు హాజరు అవుతున్నారా లేదా అన్న విషయం గ్రామస్తుల నుండి కూడా అలాగే విద్యార్థుల నుండి అడిగి తెలుసుకోవడం, దమ్ముర్ గ్రామ ప్రజలు విద్యాధికారి బి తిరుపతి పాఠశాల సందర్శించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలివెల మండల విద్యాధికారి బి తిరుపతి, మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులందరూ విధి నిర్వహణలో జాప్యం చేస్తే సహించేది ఉండదని, పలమల మారుమూల అటవీ ప్రాంతంలోని పేద విద్యార్థులకు విద్యను అందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విధులకు హాజరు కావాలని సూచించారు.



