నకిలీ ఫోన్ పే లతో తస్మాత్ జాగ్రత్త
కస్టమర్లు చూపించే పేమెంట్ స్క్రీన్ షాట్ లను నమ్మి మోసపోవద్దు. మీ బ్యాంక్ ఖాతాలో నగదు జమ అయిందో లేదో స్వయంగా చెక్ చేసుకోవాలి

డిజిటల్ లావాదేవీల పేరుతో మోసాలు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
హుజూర్ నగర్ ఎస్ఐ బండి మోహన్ హెచ్చరిక.
ఫోన్ పేతో మోసం..!
హుజూర్‌నగర్, ఏప్రిల్ 11.నిజం న్యూస్
డిజిటల్ లావాదేవీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హుజూర్ నగర్ ఎస్ఐ బండి మోహన్ వ్యాపారులకు సూచించారు…!
నకిలీ ఫోన్ పే యాప్ ల ద్వారా జరుగుతున్న మోసాలపై ఆయన పలు కీలక సూచనలు చేశారు….!
కస్టమర్లు చూపించే పేమెంట్ స్క్రీన్ షాట్ లను నమ్మి మోసపోవద్దు. మీ బ్యాంక్ ఖాతాలో నగదు జమ అయిందో లేదో స్వయంగా చెక్ చేసుకోవాలి.
కేవలం సౌండ్ బాక్స్ పైనే కాకుండా, మొబైల్ కి వచ్చే అధికారిక బ్యాంక్ మెసేజ్ లని సరిచూసుకోవాలని ఆయన కోరారు.
అసలైనవిగా భ్రమ కలిగించే ‘ఫేక్ యాప్’ల ద్వారా నగదు ట్రాన్స్ఫర్ అయినట్లు చూపిస్తారని, కానీ ఖాతాలోకి డబ్బు చేరదని గమనించాలన్నారు.
తొందరపడి మోసపోవద్దని, నగదు జమను ధృవీకరించుకున్నాకే వస్తువులు అప్పగించాలని ఎస్ఐ స్పష్టం చేశారు.
బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.



