కోదాడ హైవే పై ఘోర ప్రమాదం..16 మందికి తీవ్ర గాయాలు
హైదరాబాదు నుండి ఏలూరు వెళ్తున్న ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి బలంగా డీ కొట్టడంతో 16 మందికి గాయాలయ్యాయి. బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు.

లారీ ని డీ కొట్టిన ప్రైవేట్ బస్సు
హుజూర్‌నగర్, ఏప్రిల్.11.నిజం న్యూస్
కోదాడ హైవే పై ఘోర ప్రమాదం జరిగింది..
కోదాడ బైపాస్ వద్ద 65వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి ప్రైవేట్ బస్సు బలంగా ఢీ కొట్టింది.
హైదరాబాదు నుండి ఏలూరు వెళ్తున్న ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి బలంగా డీ కొట్టడంతో 16 మందికి గాయాలయ్యాయి. బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు.
గాయాలైన వారిని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ సంఘటనలో బస్సు మెయిన్ డోర్ ఓపెన్ కాకపోవడంతో ప్రయాణికులు ఎమర్జెన్సీ ద్వారా బయటపడ్డారు.
డ్రైవర్ నిద్ర మత్తు ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
ప్రమాదానికి కారణం ఏమిటని, ఎలా జరిగిందని పోలీసులు విచారణ చేస్తున్నారు.