ఏసీబీ వలలో రెవెన్యూ ఇన్స్పెక్టర్
క్షేత్రస్థాయి విచారణ జరిపి తహసీల్దార్‌కు నివేదిక సమర్పించేందుకు గాను రూ. 10,000/- లంచం డిమాండ్ చేయగా, అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధకశాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI) గా పనిచేస్తున్న సెడంక శ్రీమాన్, ఫిర్యాదుదారుని తల్లికి సంబంధించిన భూమిపై ‘భూ భారతి చట్టం-2025’ కింద క్షేత్రస్థాయి విచారణ జరిపి తహసీల్దార్‌కు నివేదిక సమర్పించేందుకు గాను రూ. 10,000/- లంచం డిమాండ్ చేయగా, అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధకశాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును. “ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని అధికారులు తెలుపుతున్నారు.



